మొదట వెంకటేష్, ఆ తర్వాత ఎన్టీఆర్‌తోనే..!

తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోలతో సమానమైన ఫాలోయింగ్ ఉన్న దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు.

By Medi Samrat
Published on : 12 Jun 2025 8:46 PM IST

మొదట వెంకటేష్, ఆ తర్వాత ఎన్టీఆర్‌తోనే..!

తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోలతో సమానమైన ఫాలోయింగ్ ఉన్న దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. ఆయన కొత్త సినిమాల గురించి ఊహాగానాలు పెరుగుతూనే ఉన్నాయి. నిర్మాత నాగ వంశీ త్రివిక్రమ్ సినిమాలకు సంబంధించిన లైనప్ గురించి స్పష్టత ఇస్తున్నారు. త్రివిక్రమ్ తదుపరి 2 ప్రాజెక్ట్‌లలో మొదటి వెంకటేష్ తో, తర్వాతి సినిమా జూనియర్ ఎన్టీఆర్ తో అని స్పష్టం చేశారు. మిగతావన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమేనని, త్రివిక్రమ్ ప్రాజెక్ట్‌ కు సంబంధించిన వివరాలను తప్పకుండా తాను తెలియజేస్తానని వంశీ వివరణ ఇచ్చారు.

త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమా గురించి విని టాలీవుడ్ వర్గాలు షాక్ అయ్యాయి. ఈ సినిమాను మొదట అల్లు అర్జున్ తో ప్లాన్ చేశారు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో బిజీగా ఉన్న అల్లు అర్జున్ ఈ సినిమా పూర్తి చేసిన తర్వాతే తర్వాతి సినిమాపై నిర్ణయం తీసుకుంటానని త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే నిర్మాత నాగ వంశీ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా గురించి క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా సుబ్రహ్మణ్యేశ్వరుడి నేపథ్యంలో సాగుతుంది.

Next Story