ఘోరం.. స్కూల్‌ అభివృద్ధి కోసం రెండో తరగతి విద్యార్థి బలి

ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఘోర సంఘటన వెలుగులోకి వచ్చింది.

By Srikanth Gundamalla  Published on  27 Sep 2024 2:32 PM GMT
ఘోరం.. స్కూల్‌ అభివృద్ధి కోసం రెండో తరగతి విద్యార్థి బలి

ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఘోర సంఘటన వెలుగులోకి వచ్చింది. మూఢనమ్మకాలు ఇంకా ఏదో మూలన ఉండే ఉన్నాయి. తాజాగా మరోటి జరిగింది. ఉత్తర్‌ ప్రదేశ్‌లో క్షుద్రపూజల పేరిట ఓ బాలుడిని బలి ఇచ్చారు. స్కూల్‌ అభివృద్ధి చెందాలంటే రెండో తరగతి చదువుతున్న బలి ఇచ్చారు. ఈ హత్య స్కూల్‌ హాస్టల్‌లోనే జరిగింది. వారం రోజుల క్రితం ఈ సంఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పాఠశాల యజమాని జసోదన్‌ సింగ్‌తో పాటు.. అతని కుమారుడు దినేష్‌ భఘేల్‌, మరో ముగ్గురు ఉపాధ్యాయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో పలు కీలక విషయాలు బయటపడ్డాయని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు చెప్పారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 11 ఏళ్ల కృతార్థ్‌ బాలుడు హథ్రాస్‌ జిల్లాలోని రస్‌గవాన్‌లోని డీఎల్‌ పబ్లిక్‌ స్కూల్‌లో రెండో తరగతి చదువుతున్నాడు. గతవారం తన కొడుకు ఆరోగ్యం బాగోలేదని సోమవారం ఆయనకు కాల్‌ వచ్చింది. దీంతో తండ్రి స్కూల్‌ వద్దకు వెళ్లాడు. బాలుడిని పాఠశాల డైరెక్టర్ తండ్రి కారులో తీసుకెళ్లాడని అక్కడున్న వార్డెన్ చెప్పాడు. దాంతో.. వాళ్లు తిరిగి వస్తారని అక్కడే కూర్చున్నాడు బాలుడి తండ్రి. చివరకు బాలుడు చనిపోయాడని దినేశ్ బాఘెల్ చెప్పాడు. తన కారులో ఉన్న మృతదేహాన్ని అప్పగించాడు. ఇక పోలీసులకు అతను ఫిర్యాదు చేయడంతో క్షుద్రపూజల అంశం వెలుగులోకి వచ్చింది. ముందుగా బాలుడిని బావి దగ్గర చంపాలని భావించారు.. కానీ చిన్నారి అరవడంతో గొంతు నులిమి చంపేశారని పోలీసులు చెప్పారు. అలాగే క్షుద్రపూజలకు సంబంధించి కొన్ని వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నామని చె ప్పారు పోలీసులు. గతంలో కూడా స్కూల్‌ యజమాన్యం ఇలాంటి తరహా బలి ఇచ్చేందుకు ప్రయత్నించిందని కూడా పోలీసులు చెప్పారు.

Next Story