ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో దారుణ ఘటన జరిగింది. ఓ 30 ఏళ్ల వ్యక్తి తన భార్యను విచక్షణారహితంగా కొట్టి.. ఆమె ప్రైవేట్ భాగాలకు తీవ్ర గాయం చేశాడు. బిడ్డకు జన్మనివ్వడం లేదని క్రూరంగా దాడి చేశాడు. మోహన్‌లాల్‌గంజ్ పోలీస్ సర్కిల్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో తీవ్ర రక్తస్రావమైన బాధితురాలు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. నిందితుడు భర్త పరారీలో ఉన్నాడు. ఈ విషయాన్ని బాధితురాలి సోదరుడు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
లక్నో అదనపు డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ మనీషా సింగ్ మాట్లాడుతూ.. ''ఆరేళ్ల క్రితం నిందితుడు తన సోదరిని వివాహం చేసుకున్నట్లు ఫిర్యాదుదారు మాకు తెలియజేశారు. అయితే తనకు బిడ్డ పుట్టకపోవడంతో నిందితుడు మనస్తాపం చెందడంతో బాధితురాలు మూడు నెలలుగా తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. నిందితుడు ఆమెను గది లోపలికి తీసుకెళ్లిన తర్వాత సోమవారం నాడు బాధిత మహిళ తన అత్తమామల ఇంటికి తిరిగి వెళ్లింది. మహిళ తన అత్తమామల ఇంటికి తిరిగి వెళ్లిన కొన్ని గంటల్లోనే ఈ నేరం జరిగింది'' అని తెలిపారు.
నిందితుడు మొదట మహిళతో అసహజ సంభోగానికి పాల్పడ్డాడని, ఆపై షేవింగ్ రేజర్‌తో దాడి చేశాడని పోలీసు అధికారి తెలిపారు. గాయపడిన మహిళ, ఎలాగోలా తన సోదరుడికి సమాచారం ఇవ్వడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. ''కేసుపై తదుపరి విచారణ జరుగుతోంది. నిందితుడిపై గాయాలు, గృహ హింస, బెదిరింపులకు సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది'' అని అధికారి తెలిపారు.