గంటలు గంటలు ఫోన్‌లో చాటింగ్‌.. భార్యను చీరతో గొంత కోసి చంపిన భర్త

Uttar Pradesh man strangles wife over mobile chatting. ఓ యువకుడు తన భార్యను చీరతో గొంతు కోసి హత్య చేసి, ఆపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయి నేరాన్ని

By అంజి  Published on  1 March 2022 6:21 AM GMT
గంటలు గంటలు ఫోన్‌లో చాటింగ్‌.. భార్యను చీరతో గొంత కోసి చంపిన భర్త

ఓ యువకుడు తన భార్యను చీరతో గొంతు కోసి హత్య చేసి, ఆపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయి నేరాన్ని అంగీకరించాడు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ఉన్నావ్ జిల్లా హసన్‌గంజ్ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని అహ్మద్‌పూర్ వడే గ్రామంలో ఈ దారుణం జరిగింది. దంపతులు గత కొన్నేళ్లుగా ఆరేళ్ల కుమారుడితో కలిసి స్థానికంగా నివసిస్తున్నారు. తన భార్య ఎక్కువసేపు మొబైల్‌ ఫోన్‌ను వాడడంతో మనస్తాపం చెంది ఆమెను గొంతు కోసి చంపినట్లు ఆ వ్యక్తి పోలీసులకు తెలిపాడు.

సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ.. "నిందితుడి భార్య గంటలు గంటలు మొబైల్ ఫోన్‌లో చాట్ చేసేది. అతను ఆమె ఫోన్‌ను తనిఖీ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆమె అతనితో గొడవ పడేది. ఈ క్రమంలోనే సోమవారం భార్య తన భర్తతో గొడవ పడింది. ఆ తర్వాత ఆ వ్యక్తి తన భార్యను గొంతు నులిమి చంపాడు. నిందితుడు అరుణ్‌పై హత్యానేరం కింద కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేశారు. అరుణ్‌కి ఆర్తితో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. ఇంటి సమీపంలోని ఓ దుకాణంలో టైలర్‌గా పనిచేసేవారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు.

Next Story
Share it