షాకింగ్: భర్తను చంపి.. మృతదేహం పక్కనే పడుకున్న భార్య..
UP woman kills husband, sleeps next to his body. మద్యం సేవించే విషయంలో తరచూ గొడవలు జరగడంతో భర్తను.. అతని భార్య హత్య చేసింది.
By అంజి
మద్యం సేవించే విషయంలో తరచూ గొడవలు జరగడంతో భర్తను.. అతని భార్య హత్య చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో ఈ సంఘటన జరిగింది. మృతుడు తన భార్య, పిల్లలతో నివసించేవాడు. భర్తను హత్య చేసిన రాత్రి.. నిందితురాలు అతని మృతదేహం పక్కనే పడుకుంది. మరుసటి రోజు ఉదయం, పిల్లలను కూడా వారి తండ్రిని లేపవద్దని కోరింది.
వివరాల ప్రకారం.. మృతుడు అతుల్ అనే వ్యక్తి డిసెంబర్ 15న మద్యం మత్తులో ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అతని భార్య అన్నూతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలోనే భార్య.. తన భర్త తలపై దాడి చేసింది. అతడు గాయపడిన తర్వాత అతని గొంతు నులిమి చంపింది. ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. నిందితురాలు అన్నూ పరిసరాల్లో బ్యూటీ పార్లర్‌ను నడుపుతోందని తెలిపారు.
నేరం చేసిన తర్వాత ఆమె తన భర్త మృతదేహం పక్కనే పడుకుంది. మరుసటి రోజు ఉదయం, ఆమె పనికి బయలుదేరింది. అతుల్‌ను నిద్ర నుండి లేపవద్దని తన పిల్లలను కోరింది. సాయంత్రం అన్నూ ఇంటికి తిరిగి వచ్చి డిన్నర్ చేసింది. పిల్లలు నిద్రలోకి జారుకున్న తర్వాత, నిందితుడు అతుల్ మృతదేహాన్ని ఈడ్చుకెళ్లి ఆమె ఇంటి గేటు వద్ద పడేసింది.
మరుసటి రోజు ఉదయం ఆమె స్వయంగా కేకలు వేసి, ఇరుగుపొరుగు వారిని అప్రమత్తం చేసి, తన భర్త బాగా తాగి ఉండటంతో కిందపడి చనిపోయాడని చెప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
అనంతరం అన్నూ రికార్డు చేసిన వాంగ్మూలాల్లో తేడాలున్నాయని గుర్తించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత నేరం అంగీకరించడంతో ఆమెను జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అన్నూ తన వాంగ్మూలంలో తన భర్త అతుల్ తాగుబోతు అని, రోజూ తనను కొట్టేవాడని చెప్పింది. ఆమెను డబ్బులు కూడా అడిగేవాడు.
డిసెంబరు 14న కూడా (అతుల్ హత్యకు ముందు రోజు రాత్రి) తనకు, తన భర్తకు గొడవ జరిగిందని అన్నూ చెప్పింది. తనకు అవమానం జరిగినట్లు భావించి భర్తను హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు నిందితురాలు తెలిపింది.