తాను మత మార్పిడికి అభ్యంతరం చెప్పినప్పుడు తన భర్త తనను తరచూ కొట్టి హింసించాడని, సిగరెట్ పీకలతో కాల్చివేసి, బలవంతంగా మాంసం తినేలా చేశాడని ఓ మహిళ ఆరోపించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో చోటుచేసుకుంది. తన భర్త చాంద్ మహ్మద్ తన మతపరమైన గుర్తింపును దాచి హిందువుగా చూపించి మోసపూరితంగా పెళ్లి చేసుకున్నాడని ఆ మహిళ ఆరోపించింది. మహ్మద్ తనను పెళ్లి చేసుకోవడానికి సాని మౌర్య వలె నటించాడని మహిళ తెలిపింది. పెళ్లి తర్వాత వారు నగరంలో అద్దెకు ఉంటున్నారు.
ఆ వ్యక్తి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, ఇస్లాం మతాన్ని స్వీకరించేందుకు ప్రతిఘటించడంతో తనపై సిగరెట్ పీకలతో కాల్చివేసి, వేడి నూనె పోశాడని మహిళ ఆరోపించింది. తనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తానని, తనపై అత్యాచారం చేస్తానని బెదిరించాడని ఆమె పేర్కొంది. మహిళ ఇంటి నుంచి పారిపోయి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించిన ప్రతిసారీ, ఆ వ్యక్తి ఆమెను తమ గదిలోకి లాక్కెళ్లి కొట్టేవాడని బాధితురాలు ఆరోపించింది. ఆమె ఐదు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు మొహమ్మద్ తన కడుపులో కొట్టడంతో గర్భస్రావం జరిగిందని ఆమె పేర్కొంది. మహిళ ఇప్పుడు వన్ స్టాప్ సెంటర్ ద్వారా రక్షించబడింది. ఆమె త్వరలో పోలీసులకు ఫిర్యాదు చేయనుంది.