యూపీ: ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి

UP Road accident, 14 dead .. ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాగ్‌రాజ్‌ వైపు వెళ్తున్న ఓ బొలెరో వాహనం

By సుభాష్  Published on  20 Nov 2020 4:03 AM GMT
యూపీ:  ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాగ్‌రాజ్‌ వైపు వెళ్తున్న ఓ బొలెరో వాహనం వేగంగా వచ్చి రోడ్డు పక్కనే నిలిపి ఉన్న లారీని వెనుక భాగంలో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందారు. మృతుల్లో ఆరుగురు చిన్నారులున్నారు. ప్రయాగ్‌రాజ్‌ సమీపంలోని మాణిక్‌పూర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోకి వచ్చే కుండా కొత్వాల్‌ ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. భారీ శబ్దంతో ఈ ప్రమాదం జరగడంతో గమనించిన స్థానికులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే వాహనాల్లో ఇరుక్కున్న మృతదేహాలను వెలికి తీసేందుకు ప్రయత్నించగా, ఎంతకి వెళ్లకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వాహనాలను కట్టర్లతో ఎక్కడికక్కడ కట్‌ చేసి మృతదేహాలను బయటకు తీశారు. ఈ ప్రమాదంలో మరి కొందరు తీవ్రంగా గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితులు ఓ వివాహ కార్యక్రమానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story
Share it