దారుణం.. 13 ఏళ్ల బాలికపై అత్యాచారం.. ఇంటి బయటకు ఆడుకుంటుండగా..

UP Police arrests 30-year-old man for raping minor girl. ఉత్తరప్రదేశ్‌లోని ఒరైలో ఇంటి బయట ఆడుకుంటున్న 13 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. మైనర్ బాలికపై అత్యాచారం

By అంజి  Published on  7 March 2022 10:37 AM GMT
దారుణం.. 13 ఏళ్ల బాలికపై అత్యాచారం.. ఇంటి బయటకు ఆడుకుంటుండగా..

ఉత్తరప్రదేశ్‌లోని ఒరైలో ఇంటి బయట ఆడుకుంటున్న 13 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. మైనర్ బాలికపై అత్యాచారం చేసి నిర్జన ప్రాంతంలో వదిలేశాడు. 13 ఏళ్ల బాలిక మిస్సింగ్ ఫిర్యాదుతో తల్లిదండ్రులు నమోదు చేయడంతో పోలీసులు బాలిక ఆచూకీ కనుగొన్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం పంపించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన అంతా జలౌన్‌లోని ఓరై కొత్వాలి ప్రాంతంలో చోటుచేసుకుంది.నిందితుడు పొరుగున నివసించే ఆసిఫ్ షా అనే 30 ఏళ్ల వ్యక్తి.. ఆడుకోవడానికి కొత్త బొమ్మలు కొనిస్తానంటూ మైనర్ బాలికను ఎంచుకొని నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లాడు.

ఆ తర్వాత బాలికపై దారుణానికి ఒడిగట్టాడు. నొప్పితో ఏడుస్తూ ఒంటరిగా ఉన్న బాలిక కేకలు విని సమీపంలో ఉన్నవారు ఆమెను కుటుంబ సభ్యుల వద్దకు తీసుకెళ్లారు. కుమార్తె పరిస్థితి చూసి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితురాలి కుటుంబ సభ్యులు ఒరై కొత్వాలిలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు తక్షణమే చర్యలు తీసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు అదనపు పోలీసు సూపరింటెండెంట్ అసీమ్ చౌదరి తెలిపారు. కేసు నమోదు చేయడంతో పాటు బాలికను వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు.

Next Story
Share it