ఆస్తి వివాదం.. భర్త జననాంగాలపై బ్లేడ్‌తో భార్య, కొడుకు దాడి
ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌కు చెందిన ఒక మధ్య వయస్కుడైన వ్యక్తిపై అతని భార్య, కొడుకు, కోడలు దాడికి పాల్పడ్డారు.
By - అంజి |
ఆస్తి వివాదం.. భర్త జననాంగాలపై బ్లేడ్‌తో భార్య, కొడుకు దాడి
ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌కు చెందిన ఒక మధ్య వయస్కుడైన వ్యక్తిపై అతని భార్య, కొడుకు, కోడలు దాడికి పాల్పడ్డారు. ఆస్తి వివాదం తర్వాత తన కుమారుడు, కోడలు, భార్య తనపై దాడి చేసి, తన జననాంగాలకు తీవ్ర గాయాలు చేశారని భర్త ఆరోపించాడు.
బాధితుడు శంకర్ లాల్ చెప్పిన దాని ప్రకారం.. తాను ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి ఈ దాడి జరిగిందని, ముగ్గురు వ్యక్తులు తనపై దాడి చేసి తర్వాత తన భార్య గదిలోకి లాక్కెళ్లి బ్లేడుతో దారుణంగా దాడి చేసిందని అతను ఆరోపించాడు. "నా కొడుకు, అతని భార్య ఆ ఇంటిని తన పేరు మీద పెట్టాలని కోరుకున్నారు" అని అతను చెప్పాడు. "రాత్రి నేను నిద్రపోతున్నప్పుడు వాళ్ళు నాపై దాడి చేశారు. వాళ్ళు నా ఛాతీపై బండరాయితో కొట్టారు. ఆ తర్వాత నా భార్య బ్లేడ్ తీసుకుని నా ప్రైవేట్ పార్ట్స్‌లో పొడిచింది." శంకర్ లాల్ అరుపులు విన్న పొరుగువారు అతని ఇంటికి పరిగెత్తుకుని అధికారులకు సమాచారం అందించారని పోలీసులు తెలిపారు. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడు.
ఆస్తి యాజమాన్యం విషయంలో జరిగిన "కుట్ర"లో భాగంగా ఈ దాడి జరిగిందని శంకర్ లాల్ పేర్కొన్నాడు. దాడి సమయంలో తన కుటుంబ సభ్యులు తన జేబులోంచి నగదు దొంగిలించారని కూడా అతను ఆరోపించాడు.
శంకర్ లాల్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు నగర పోలీసు సూపరింటెండెంట్ కుమార్ రణ్ విజయ్ సింగ్ ధృవీకరించారు. "దర్యాప్తు జరుగుతోంది, దోషులుగా తేలిన ఎవరిపైనైనా కఠిన చర్యలు తీసుకుంటాము" అని సింగ్ అన్నారు. నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.