దారుణం.. ఏపీలో మరో టమాటా రైతు హత్య

ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో మరో దారుణ ఘటన జరిగింది. గుర్తు తెలియని దండుగులు మరో టమాటా రైతును హత్య చేశారు.

By అంజి
Published on : 18 July 2023 8:26 AM IST

tomato farmer, pedttippasamudram, annamaiah district, Crime news

దారుణం.. ఏపీలో మరో టమాటా రైతు హత్య 

ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో మరో దారుణ ఘటన జరిగింది. గుర్తు తెలియని దండుగులు మరో టమాటా రైతును హత్య చేశారు. వారం రోజుల్లో ఇది రెండో హత్య ఘటన. వారం రోజుల కిందట ఇదే జిల్లాలోని బోడుమల్లదిన్నె గ్రామంలో టమాటాల కోసం రైతు నరేం రాజశేఖర్‌రెడ్డిని హత్య చేశారు. ఆదివారం రాత్రి పెద్దతిప్పసముద్రం మండలంలోని నవాబుకోటకు గ్రామానికి చెందిన మధుకర్‌రెడ్డి అనే రైతును గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. టమాటా ధర భారీగా పెరగడంతో.. రైతులు తమ టమాటాను కాపాడుకోవడం కోసం పొలం వద్దే కాపలాగా ఉంటున్నారు.

చాలామంది రైతులు రాత్రి సమయంలో కూడా అక్కడే నిద్రిస్తున్నారు. రైతు మధుకర్‌రెడ్డి కూడా తన టమోటా తోట వద్ద టెంటు వేసుకుని ఆదివారం రాత్రి నిద్రపోయాడు. ఈ క్రమంలోనే టమాటా పంటకు కాపలాగా ఉన్న మధుకరరెడ్డిని ఆదివారం రాత్రి దుండగులు హత్య చేశారు. సోమవారం ఉదయం పొలం వద్దకు వెళ్లిన కుటుంబ సభ్యులు అతని శవాన్ని చూసి ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు రైతు మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story