ఐఫోన్ ఆర్డర్‌.. డబ్బులేక డెలివరీ బాయ్‌ని చంపి.. 4 రోజుల పాటు ఇంట్లోనే

Unable to pay for iPhone, Karnataka man kills delivery boy. కర్ణాటకలోని హసన్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. తన ఇంటి దగ్గర ఐఫోన్

By అంజి  Published on  20 Feb 2023 2:00 PM IST
ఐఫోన్ ఆర్డర్‌.. డబ్బులేక డెలివరీ బాయ్‌ని చంపి.. 4 రోజుల పాటు ఇంట్లోనే

కర్ణాటకలోని హసన్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. తన ఇంటి దగ్గర ఐఫోన్ డెలివరీ చేయడానికి వచ్చిన ఈ-కార్ట్ డెలివరీ పార్టనర్‌ను 20 ఏళ్ల యువకుడు హత్య చేశాడు. నిందితుడు మృతదేహాన్ని తన ఇంట్లో నాలుగు రోజుల పాటు భద్రపరిచి రైల్వే స్టేషన్‌కు సమీపంలో కాల్చాడు. హాసన్‌లోని అరిస్కెరె పట్టణానికి చెందిన హేమంత్ దత్‌గా గుర్తించిన నిందితుడు, ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ఐఫోన్‌కు చెల్లించడానికి డబ్బు లేకపోవడంతో డెలివరీ బాయ్‌ని ఇంట్లోనే కత్తితో పొడిచాడు.

ఫిబ్రవరి 11వ తేదీన అంచకొప్పల్ రైల్వే స్టేషన్ సమీపంలో కాలిపోయిన మృతదేహం కనిపించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత విచారణ ప్రారంభించబడింది. ఈ-కార్ట్ ఎక్స్‌ప్రెస్‌లో పనిచేస్తున్న మృతుడు హేమంత్ నాయక్ (23) ఫిబ్రవరి 7న లక్ష్మీపుర లేఅవుట్ సమీపంలో హేమంత్ దత్తా బుక్ చేసిన సెకండ్ హ్యాండ్ ఐఫోన్ డెలివరీ చేసేందుకు వెళ్లినట్లు విచారణలో తేలింది. ఈ క్రమంలో డబ్బు రూ.46వేలు ఇవ్వాల నాయక్ డిమాండ్ చేయడంతో హేమంత్ కత్తితో పొడిచి హత్య చేసి మృతదేహాన్ని నాలుగు రోజులుగా తన ఇంట్లో ఉంచాడు.

అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో వేసి బైక్‌పై తీసుకెళ్లి రైల్వే స్టేషన్‌ సమీపంలో తగులబెట్టాడు. నిందితుడు మృతదేహాన్ని తగలబెట్టేందుకు వెళుతుండగా బైక్‌పై మృతదేహాన్ని తీసుకెళ్లడం సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

Next Story