హైదరాబాద్‌లో దారుణం.. ఇద్దరు ట్రాన్స్‌జెండర్ల హత్య

హైదరాబాద్‌ నగరంలో మరో దారుణ ఘటన జరిగింది. ఇద్దరు ట్రాన్స్‌జెండర్లను దుండగులు హతమార్చారు. మంగళవారం అర్ధరాత్రి టప్పచబుత్ర

By అంజి
Published on : 21 Jun 2023 9:27 AM IST

Two transgenders, murder, Daibagh, Tappachebutra PS, Crimenews

హైదరాబాద్‌లో దారుణం.. ఇద్దరు ట్రాన్స్‌జెండర్ల హత్య 

హైదరాబాద్‌ నగరంలో మరో దారుణ ఘటన జరిగింది. ఇద్దరు ట్రాన్స్‌జెండర్లను దుండగులు హతమార్చారు. మంగళవారం అర్ధరాత్రి టప్పచబుత్ర పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు కత్తులు, బండరాళ్లతో దాడి చేసి ఇద్దరు ట్రాన్స్‌జెండర్లను చంపారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు చెరవేశారు. ఆ వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. టప్పచబుత్ర పీఎస్‌ పరిధిలోని దైబాగ్‌ ప్రాంతంలో యూసుఫ్‌ అలియాస్‌ డాలి (25), రియాజ్‌ అలియాస్‌ సోఫియా (30) ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు నివాసం ఉంటున్నారు.

మంగళవారం అర్ధరాత్రి టైంలో కొంతమంది దుండగులు ట్రాన్స్‌జెండర్లపై కత్తులతో దాడి చేసి హత్య చేశారు. ఘటన తర్వాత హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలో పోలీసులు ఓ కత్తిని స్వాధీనం చేసుకున్నారు. జంట హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. స్థానికుల నుంచి పలు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. డీసీ కిరణ్ ఖరే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించామని, ఈ హత్యపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. నిందితులను గుర్తించి త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.

Next Story