వందే భారత్ ట్రైన్ ఢీకొని నర్సింగ్ విద్యార్థులు మృతి.. సీసీటీవీ ఫుటేజ్‌లో మాత్రం..

బెంగళూరులోని చిక్కబనవర రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొని ఇద్దరు నర్సింగ్ మొదటి సంవత్సరం విద్యార్థులు మరణించారు.

By -  Medi Samrat
Published on : 25 Nov 2025 7:00 PM IST

వందే భారత్ ట్రైన్ ఢీకొని నర్సింగ్ విద్యార్థులు మృతి.. సీసీటీవీ ఫుటేజ్‌లో మాత్రం..

బెంగళూరులోని చిక్కబనవర రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొని ఇద్దరు నర్సింగ్ మొదటి సంవత్సరం విద్యార్థులు మరణించారు. బెంగళూరు-బెళగావి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వారిద్దరినీ ఢీకొట్టడంతో ప్రాణాలు వదిలారు. బెంగళూరు గ్రామీణ రైల్వే పోలీస్ స్టేషన్ అధికారులు ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారని రైల్వే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ యతీష్ ఎన్ తెలిపారు.

ఇద్దరూ కేరళకు చెందినవారు. సప్తగిరి కళాశాలలో మొదటి సంవత్సరం బి.ఎస్సీ నర్సింగ్ విద్యార్థులు. ఇద్దరూ స్నేహితులు అని పోలీసులు తెలిపారు. ప్రాథమిక దర్యాప్తులో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్‌ల ప్రాథమిక పరీక్ష ఆధారంగా, ఇది ఆత్మహత్య కేసుగా కనిపిస్తోందని ఎస్పీ చెప్పారు. రైలు రావడానికి కొన్ని క్షణాల ముందు ఇద్దరూ ఒకరినొకరు పట్టుకున్నట్లు ఫుటేజ్‌లో కనిపిస్తోంది. అయితే, ఖచ్చితమైన కారణం ఇంకా తెలియలేదన్నారు. ఇప్పటివరకు, ఎటువంటి సూసైడ్ నోట్ లేదా సంబంధిత సామగ్రిని స్వాధీనం చేసుకోలేదని ఆయన అన్నారు. సంఘటనా స్థలంలో లభించిన మొబైల్ ఫోన్లు పూర్తిగా దెబ్బతిన్నాయని స్పష్టం చేశారు. బెంగళూరు గ్రామీణ రైల్వే పోలీస్ స్టేషన్‌లో పోలీసులు అసహజ మరణ నివేదిక (UDR) నమోదు చేశారు. మరణాలకు దారితీసిన కారణాలను తెలుసుకోడానికి దర్యాప్తు అధికారులు ఇప్పుడు వారి కళాశాల, తెలిసిన వాళ్ల నుండి వివరాలను సేకరిస్తున్నారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.

Next Story