గంగా నది తీరంలో ఇద్దరు మైనర్ల మృతదేహాలు.. హత్యగా అనుమానం
పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలోని గంగా నది ఒడ్డున ఇద్దరు మైనర్ బాలుర మృతదేహాలను సోమవారం సాయంత్రం కనిపించాయి.
By అంజి Published on 29 March 2023 9:24 AM ISTగంగా నది తీరంలో ఇద్దరు మైనర్ల మృతదేహాలు.. హత్యగా అనుమానం
పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలోని గంగా నది ఒడ్డున ఇద్దరు మైనర్ బాలుర మృతదేహాలను సోమవారం సాయంత్రం కనిపించాయి. పోలీసులు ఈ ఘటనకు సంబంధించిన కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరిని హత్య చేసినట్లు మృతుల్లో ఒకరి తల్లి ఆరోపించింది. స్థానిక సమాచారం ప్రకారం.. ఇద్దరు బాలురు 8, 12 సంవత్సరాల వయస్సు గలవారు. వారు బంధువులు కూడా. వారి మృతదేహాలను కనుగొనడానికి ఒక రోజు ముందు వారు అదృశ్యమయ్యారు. 8 ఏళ్ల బాలుడి తల్లి రాణి ఖాతున్ మాట్లాడుతూ.. తన కొడుకు, అతని బంధువును ఒక వ్యక్తి హత్య చేశాడని, తన 16 ఏళ్ల కుమార్తెను కూడా కిడ్నాప్ చేశాడని పేర్కొంది. మూడు నెలల క్రితం ఆ వ్యక్తి తన 16 ఏళ్ల కుమార్తెను అపహరించి, తన కుమారుడిని చంపేందుకు తిరిగి వచ్చాడంటూ ఖాతున్ ఆరోపించారు.
''సోమవారం నేను పనికి బయలుదేరినప్పుడు మా అబ్బాయి నిద్రపోతున్నాడు. నేను బయలుదేరే ముందు అల్పాహారం చేసి వారికి తినిపించాను. వారు రోజంతా ఇంటి పరిసరాల్లో ఆడుకున్నారు. అతను సమీపంలోని మసీదుకు ఇఫ్తార్ కోసం నా సోదరి కొడుకుతో పాటు వెళ్లారు. అప్పటి నుండి వారు తప్పిపోయారు'' అని ఖాతున్ చెప్పారు. పిల్లలు ఆచూకీ లభించకపోవడంతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పిల్లల మృతదేహాలను గుర్తించిన తర్వాత.. "పిల్లలు దారుణంగా హత్య చేయబడ్డారు" అని ఆమె చెప్పింది. మృతదేహాలను తొలుత స్థానికులు గుర్తించి పంచపాడ పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. పోస్ట్ మార్టం రిపోర్టు కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు.