రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
By అంజి Published on 21 Aug 2023 9:35 AM IST
రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
రహదారులు రక్తమోడుతున్నాయి. నిర్లక్ష్యపు డ్రైవింగ్, అతివేగంగా నడపడం వల్ల అమాయకుల ప్రాణాలు బలవుతున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మహేశ్వరం మండలంలోని తుక్కుగూడ శ్రీశైలం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. తుక్కుగూడ వైపు నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు అత్యంత వేగంగా వెళ్లి బైకును ఢీకొనడంతో బైక్‌పై వెళ్తున్న ముగ్గురిలో ఇద్దరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు.
మృతి చెందిన వారిని మహేశ్వరం మండలంలోని మంకల్ పారిశ్రామిక వాడలో ఉన్న శ్రీనాథ్ రోటో ప్యాక్లో పని చేసేవారిగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో జనమజిత్ (6) అనే బాబు సంఘటన స్థలంలోనే మృతి చెందగా ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో మార్గమధ్యం లోనే సత్య జీత్ అనే వ్యక్తి మృతి చెందారు. వీరంతా ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదం జరిగిన నలభై నిమిషాలకు కూడా అంబులెన్స్ రాకపోవడంతో స్థానికుల సాయంతో పోలీసులు బైక్ పై స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో ఉన్న సిసిటీవీ పుటేజ్‌ని ఆధారంగా చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.