16 ఏళ్ల బాలికపై అధికార పార్టీ నేత అత్యాచారం.. నమ్మి సరేనని వెళ్తే..

TRS leader sexually assaults 16-year-old girl. తెలంగాణ రాష్ట్రంలో దారుణ ఘటన వెలుగు చూసింది. అధికారి పార్టీకి చెందిన ఓ నాయకుడు 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి

By అంజి  Published on  28 Feb 2022 5:25 AM GMT
16 ఏళ్ల బాలికపై అధికార పార్టీ నేత అత్యాచారం.. నమ్మి సరేనని వెళ్తే..

తెలంగాణ రాష్ట్రంలో దారుణ ఘటన వెలుగు చూసింది. అధికారి పార్టీకి చెందిన ఓ నాయకుడు 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నిర్మల్‌ జిల్లా పరిధిలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశ్వనాథ్‌పేటకు చెందిన టీఆర్‌ఎస్‌ నాయకుడు షేక్‌ సాజిద్‌ స్థానిక వార్డు నుండి కౌన్సిలర్‌గా ఎన్నికై, వైస్‌ చైర్మన్‌ పదవిని చేపట్టాడు. సాజిద్ ఖాన్ జనవరిలో ఓ మహిళతో పాటు 8వ తరగతి చదువుతున్న బాధితురాలిని హైదరాబాద్‌కు తీసుకెళ్లి ఈ నేరానికి పాల్పడ్డాడు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో బాధితురాలిని షాజిద్ ఖాన్ అప్పగించేందుకు అన్నపూర్ణ అనే మహిళ ఉద్దేశపూర్వకంగా సహకరించిందని పోలీసులు అనుమానిస్తున్నారు. సాజిద్ ఖాన్‌ను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు

నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ సాజిద్ ఖాన్ బాలికను పలు ప్రాంతాలకు తీసుకెళ్లి నేరానికి పాల్పడ్డాడు. పోలీసుల వద్దకు వెళ్లొద్దని కూడా ఆమెను బెదిరించాడు. కానీ అతని డిమాండ్లు పక్కన పెట్టిన బాలిక తనకు జరిగిన అన్యాయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వారు శనివారం రాత్రి ఆమెను పోలీసుల దగ్గరికి తీసుకెళ్లారు. సాజిద్ ఖాన్‌పై మొదట కేసు నమోదు చేయడానికి వెనుకాడిన పోలీసులు చివరకు అతనిపై పోక్సో, ఐపిసి సెక్షన్ 376 కింద కేసు నమోదు చేశారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడం గురించి తెలుసుకున్న సాజిద్ ఖాన్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. మరోవైపు బాధితురాలిని సఖి కేంద్రానికి తరలించారు. నిర్మల్ ఎస్పీ సిహెచ్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. నిందితుడి స్థాయితో సంబంధం లేకుండా త్వరలో అరెస్టు చేస్తామని చెప్పారు. నాలుగు బృందాలను ఏర్పాటు చేశామని, త్వరలోనే అతడిని పట్టుకుంటామని, భైంసా, నిర్మల్‌, ఆదిలాబాద్‌లో గాలిస్తున్నామని చెప్పారు.

Next Story
Share it