కొడుకును చంపి ఇంటి ముందు పాతిపెట్టిన తండ్రి.. అడ్డుకున్న తల్లిపై దాడి

Tripura man kills 3-year-old son, buries body near home. త్రిపురలోని అగర్తలాలోని బల్దాఖల్ ప్రాంతంలో ఒక వ్యక్తి తన మూడున్నరేళ్ల కొడుకును

By అంజి  Published on  18 Jan 2023 5:24 PM IST
కొడుకును చంపి ఇంటి ముందు పాతిపెట్టిన తండ్రి.. అడ్డుకున్న తల్లిపై దాడి

త్రిపురలోని అగర్తలాలోని బల్దాఖల్ ప్రాంతంలో ఒక వ్యక్తి తన మూడున్నరేళ్ల కొడుకును హత్య చేసి, మృతదేహాన్ని తన ఇంటికి సమీపంలో పాతిపెట్టాడు. నిందితుడిని శ్యామల్ దాస్‌గా పోలీసులు గుర్తించారు. త్రిపుర పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అతన్ని గురువారం కోర్టులో హాజరు పరచనున్నారు. సమాధిని తవ్వి బాధితుడి మృతదేహాన్ని వెలికితీసి ఫోరెన్సిక్ పరీక్షకు పంపించారు. ఈ విషయంపై ఎస్‌డీపీవో న్యూ క్యాపిటల్ కాంప్లెక్స్ పరమిత పాండే మాట్లాడుతూ.. "మాకు అందించిన సమాచారం ప్రకారం.. మూడున్నరేళ్ల బాలుడిని అతని తండ్రి హత్య చేసి పూడ్చిపెట్టాడు. మూడు గంటల సుదీర్ఘ శోధన ఆపరేషన్ తర్వాత బాధితుడి ఇంటికి దగ్గరగా ఉన్న చిత్తడి ప్రాంతం నుండి మృతదేహాన్ని వెలికితీశాం" అని తెలిపారు.

బాధితురాలి తల్లి జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించిందని, అయితే ఆమె భర్త దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. "అన్ని వాంగ్మూలాలు నమోదు చేయబడ్డాయి. కేసులో ప్రధాన నిందితుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మరణానికి నిజమైన కారణాన్ని గుర్తించడానికి ఏకైక మార్గం పోస్ట్‌మార్టం ద్వారా మాత్రమే" అని పాండే చెప్పారు. ప్రాథమిక ఆధారాల ప్రకారం అతడిని మొదట హత్య చేసి పాతిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరిగేవని, రోజూ గొడవలు పడేవారని ఇరుగుపొరుగు వారు తెలిపారు.

నిందితుడి తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. తన కొడుకు కుటుంబంలోని అందరితోనూ అసభ్యంగా ప్రవర్తించేవాడు. తన మనవడు హత్యకు గురయ్యాడని తమ కోడలు ఈ ఉదయం తనకు తెలియజేసిందని, దీంతో పోలీసులకు సమాచారం అందించామని బాధితుడి తాత మీడియాకు తెలిపారు.

Next Story