ఇద్దరు ట్రాన్స్‌జెండర్లను కిడ్నాప్‌ చేసి.. కోరిక తీర్చలేదని బలవంతంగా జుట్లు కత్తిరించి.. వీడియో

Transgender persons harassed, hair cut forcibly, 2 arrested. తమిళనాడులో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. తూత్తుకుడి ప్రాంతంలో ఇద్దరు ట్రాన్స్‌జెండర్లను మరో ఇద్దరు

By అంజి  Published on  13 Oct 2022 7:45 AM GMT
ఇద్దరు ట్రాన్స్‌జెండర్లను కిడ్నాప్‌ చేసి.. కోరిక తీర్చలేదని బలవంతంగా జుట్లు కత్తిరించి.. వీడియో

తమిళనాడులో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. తూత్తుకుడి ప్రాంతంలో ఇద్దరు ట్రాన్స్‌జెండర్లను మరో ఇద్దరు వ్యక్తులు లైంగిక వేధింపులకు గురి చేశారు. ట్రాన్స్‌జెండర్ల జుట్టును ఇద్దరు వ్యక్తులు బలవంతంగా కత్తిరించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో కనిపించడంతో యోవా బుబన్, విజయ్ అనే ఇద్దరు వ్యక్తులను కలుగుమలై పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వీడియోలో ఒక వ్యక్తి బాధితుల్లో ఒకరి జుట్టును బలవంతంగా కత్తిరించాడు. ట్రాన్స్‌జెండర్ కార్యకర్త గ్రేస్ బాను ట్విట్టర్‌లో వీడియోను పంచుకున్నారు.

అక్టోబర్ 7న ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు తూత్తుకుడిలోని కోవిల్‌పట్టికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. వారిని యోవా బుబన్, విజయ్ కిడ్నాప్ చేసి దాడి చేశారు. బాధితులను నిందితులు బలవంతంగా వ్యభిచారంలోకి దింపారు. వారికి లైంగిక సాయాన్ని అందించాలని కోరారు. అయితే లైంగిక సాయాన్ని అందించలేదని ట్రాన్స్‌జెండర్లను నిందితులు వేధించారు. అంతే కాకుండా బాధితులను పట్టణం విడిచి వెళ్లాలని కూడా బెదిరించారని, బాధితులు ఎవరికీ చెప్పకుండా పట్టణం విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఇద్దరు నిందితులు ఈ సంఘటన యొక్క వీడియోను పంచుకున్నారని, లైంగిక ప్రయోజనాలను అందించకపోతే తమకు కూడా ఇదే గతి పడుతుందని ఇతర లింగమార్పిడి వ్యక్తులను బెదిరించారని కూడా వెల్లడైంది.

వీడియోలో ఉన్న ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. వీడియో వైరల్ కావడంతో.. విషయం పోలీసులకు చేరవేయబడింది. ఇద్దరు వ్యక్తులను కలుగుమలై పోలీసులు అరెస్టు చేశారు. నిందితులపై భారతీయ శిక్షాస్మృతి (IPC), లింగమార్పిడి వ్యక్తుల (హక్కుల పరిరక్షణ) చట్టం, 2019లోని సెక్షన్ల ప్రకారం వేధించడం, దుర్వినియోగం చేయడం, దాడి చేయడం, హత్యాయత్నానికి పాల్పడినందుకు కేసు నమోదు చేయబడింది. టుటికోరిన్ పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) ఎల్ బాలాజీ శరవణ మాట్లాడుతూ.. ఈ వీడియోలో బాధితులతో సహా వ్యక్తులను గుర్తించాము. ఈ విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాము అని చెప్పారు.

Next Story