అనుమానాస్పద స్థితిలో ట్రాన్స్‌జెండర్ మృతి

Transgender deceased in hyderabad.అనుమాస్ప‌ద స్థితిలో ట్రాన్స్‌జెండ‌ర్ మృతి చెందిన ఘ‌ట‌న చైత‌న్య‌పురి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో మంగ‌ళ‌వారం చోటుచేసుకుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 May 2021 1:57 AM GMT
Transgender

అనుమాస్ప‌ద స్థితిలో ట్రాన్స్‌జెండ‌ర్ మృతి చెందిన ఘ‌ట‌న చైత‌న్య‌పురి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో మంగ‌ళ‌వారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. న‌ల్ల‌గొండ జిల్లా నేరేడుగొమ్మ బుద్ద‌తండాకు చెందిన వంకునావ‌త్ మ‌హేష్ (23) మూడు సంవ‌త్స‌రాల క్రితం హైద‌రాబాద్ న‌గ‌రానికి వ‌చ్చాడు. అనంత‌రం లింగ‌మార్పిడి చేయించుకున్నాడు. త‌న పేరును అమృత‌గా మార్చుకుని.. రెండేళ్లుగా చెత‌న్య‌పురిలోని మోహ‌న్‌న‌గ‌ర్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నాడు.

ఈ క్ర‌మంలో అమృత‌కి గ‌తేడాది ఎన్టీఆర్ న‌గ‌ర్‌కు చెందిన షేక్ జావేద్‌తో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. అత‌డితో స‌హాజీవ‌నం చేస్తోంది. ఇటీవల తనను జావేద్‌ హింసిస్తున్నాడని, చేయిచేసుకుంటున్నాడని బడంగ్‌పేటలో నివసించే సోదరుడు శ్రీనుకు ఫోన్‌లో చెప్పింది. మంగళవారం సాయంత్రం ట్రాన్స్‌జెండర్‌ కమ్యూనిటీకి చెందిన కిషన్‌ అనే వ్య‌క్తి అమృత ఇంటికి వెళ్లి చూడ‌గా.. ఆమె మంచంపై విగ‌త‌జీవిగా క‌నిపించింది. ఈ విష‌యాన్ని అమృత సోద‌రుడు శ్రీనుకు ఫోన్ చేసి చెప్పాడు. శ్రీను ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసిన పోలీసులు మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.
Next Story
Share it