మ‌హ‌బూబాబాద్‌లో రైలు ప్ర‌మాదం. ఇద్ద‌రు ట్రాక్‌మెన్లు దుర్మ‌ర‌ణం

Train Accident In Mahabubabad. మ‌హ‌బూబాబాద్ లో ఘోర ప్ర‌మాదం చోటుచేసుకుంది. వేగంగా వ‌చ్చిన రైలు ఢీకొన‌డంతో ఇద్ద‌రు ట్రాక్‌మెన్లు దుర్మ‌ర‌ణం

By Medi Samrat  Published on  7 May 2021 10:20 AM GMT
train accident

మ‌హ‌బూబాబాద్ లో ఘోర ప్ర‌మాదం చోటుచేసుకుంది. వేగంగా వ‌చ్చిన రైలు ఢీకొన‌డంతో ఇద్ద‌రు ట్రాక్‌మెన్లు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న శుక్ర‌వారం ఉద‌యం చోటు చేసుకుంది. మ‌హ‌బూబాబాద్ స్టేష‌న్ ప్రాంతంలో ట్రాక్‌పై ప‌నులు నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. చ‌నిపోయిన వారిని ఎండీ పాషా(40), క‌మ‌లాక‌ర్ చారి(36) గా గుర్తించారు.

పాషా, క‌మ‌లాక‌ర్ లు ప‌నిచేస్తున్న‌ స‌మ‌యంలో ఒక‌టో ట్రాక్‌పై రైలు రావ‌డంతో.. రెండో ట్రాక్‌పైకి వెళ్లారు. ఆ స‌మ‌యంలోనే విజ‌య‌వాడ నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న‌ కోణార్క్ ఎక్స్‌ప్రెస్.. వేగంగా వ‌చ్చి ఇద్ద‌రు ట్రాక్‌మెన్ల‌ను ఢీకొట్టడంతో వారు చ‌నిపోయారు. ఒకేసారి రెండు రైళ్లు రావ‌డం, ట్రాక్‌మెన్లు గ‌మ‌నించ‌క‌పోవ‌డంతోనే ఈ ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ట్లు రైల్వే పోలీసులు వెల్ల‌డించారు. ఒకేసారి ఇద్ద‌రు ట్రాక్‌మెన్లు చ‌నిపోవ‌డంతో కార్మికుల్లోనూ, మృతుల నివాసాల్లోనూ విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.


Next Story
Share it