విషాదం.. నిజామాబాద్‌లో కుటుంబం ఆత్మహత్య

Tragedy.. Family committed suicide in a hotel room in Nizamabad. నిజామాబాద్‌ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు

By అంజి  Published on  21 Aug 2022 1:50 PM IST
విషాదం.. నిజామాబాద్‌లో కుటుంబం ఆత్మహత్య

నిజామాబాద్‌ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. జిల్లా కేంద్రంలోని ఓ హోటల్‌లో ఈ ఘటన జరిగింది. ఇద్దరు పిల్లలు సహా దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను సూర్యప్రకాష్‌, ప్రత్యూష్, వారి ఇద్దరు పిల్లలుగా గుర్తించారు. ఆదిలాబాద్‌కు చెందిన కొత్తకోట సూర్యప్రకాష్‌ అనే వ్యక్తి.. హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌ చేస్తూంటాడు. గడిచిన 15 రోజుల నుంచి భార్య ప్రత్యూష్, ఇద్దరు పిల్లలతో నిజామాబాద్‌లోని ఓ హోటల్‌లో సూర్యప్రకాష్‌ ఉంటున్నాడు.

అయితే.. ఏమైందో ఏమో తెలియదు.. ఇవాళ నలుగురు హోటల్‌ రూమ్‌లో చనిపోయి కనిపించారు. భార్య, పిల్లలు పురుగుల మందు తాగి విగతజీవులుగా కనిపించగా.. సూర్యప్రకాశ్ ఉరివేసుకుని చనిపోయి కనిపించాడు. మొదట భార్య, పిల్లలకు పురుగుల మందు తాగించిన సూర్యప్రకాశ్, ఆ తర్వాత తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. సూర్య ప్రకాశ్ హైదరాబాద్​లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కుటుంబం ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story