నిజామాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకుల మృతి

నిజామాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అర్సపల్లి చౌరస్తా వద్ద గురువారం సాయంత్రం మహీంద్రా బొలెరో ఎస్‌యూవీని

By అంజి
Published on : 28 April 2023 7:07 AM IST

Nizamabad, Crime news, Arsapalli crossroad

నిజామాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకుల మృతి

నిజామాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అర్సపల్లి చౌరస్తా వద్ద గురువారం సాయంత్రం మహీంద్రా బొలెరో ఎస్‌యూవీని ఆటో-రిక్షా ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతులంతా బోధన్ మండలం ఉట్పల్లి గ్రామానికి చెందిన వారు. వీరంతా జిల్లాలోని ఐటీ హబ్‌లో పనిచేస్తున్న ప్రశాంత్, జవాన్ నాయక్, డీవీ శ్యామ్‌లుగా గుర్తించారు. నిజామాబాద్ VI పట్టణ సబ్ ఇన్‌స్పెక్టర్ సాయి కుమార్ గౌడ్ ప్రకారం.. సెక్షన్ 304A IPC (అనుకోకుండా లేదా నిర్లక్ష్యపు చర్యతో మరణానికి కారణం), 338 IPC (ఇతరుల ప్రాణాలకు లేదా వ్యక్తిగత భద్రతకు హాని కలిగించే చర్య ద్వారా గాయపరచడం) కింద కేసు నమోదు చేయబడింది. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించగా, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న మృతుల తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.

Next Story