న‌గ‌రంలో ఒకే రోజు ముగ్గురు యువ‌తుల మిస్సింగ్

Three Young Ladies Missing In Hyderabad. హైదరాబాద్ లో గురువారం ఒక్క‌రోజే వేర్వేరు ప్రాంతాలకు చెందిన ముగ్గురు యువతులు మిస్సింగ్.

By Medi Samrat
Published on : 5 Feb 2021 11:05 AM IST

Three Young Ladies Missing In Hyderabad
హైదరాబాద్ లో గురువారం ఒక్క‌రోజే వేర్వేరు ప్రాంతాలకు చెందిన ముగ్గురు యువతులు కనిపించకుండా పోయారు. నగరంలోని లాలగుడా, బౌద్ధ నగర్, తిరుమల గిరి స్టేషన్లల పరిధిలో ఈ అదృశ్యం కేసులు నమోదు అయ్యాయని పోలీసులు తెలిపారు. బౌద్ధనగర్ లోని స్థానిక శ్రీనివాస నగర్ కాలనీకి చెందిన రోహిణి(19) అనే యువ‌తి అమీర్ పేటలోని ఓ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. గురువారం ఉదయం ఇంటినుంచి బయటకు వెళ్ళిన ఆమె.. రాత్రైనా ఇంటికి రాకపోవడంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.


అలాగే.. తిరుమలగిరిలో ఉంటున్న‌ మంజుల (20) ఓ స్కూలులో రిసెప్ష‌నిస్టుగా ప‌నిచేస్తుంది. రోజు మాదిరే ఉద్యోగానికి వెళ్లి.. అక్కడ తన తోటి ఉద్యోగుల‌కు ఓ ఉత్తరం ఇచ్చి.. అది తన తల్లిదండ్రులకు చేర్చమని చెప్పి వెళ్ళిపోయింది. ఇంట్లో ఉండటం త‌న‌కు ఇష్టం లేదని ఆమె పేర్కొంది. లేఖ అందుకున్న‌ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కేసు రిన‌మోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇక లాలాగుడా పరిధి అడ్డగుట్టలో మ‌రో యువ‌తి ఇంటినుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అడ్డగుట్టకు చెందిన‌ కీర్తి ప్రజ్ఞ(20) అడ్డగుట్టలో నివాసం ఉంటోంది. పని ఉందని ఇంటినుండి బ‌య‌ట‌కు వెళ్లిన యువ‌తి ఎంతకూ తిరిగి రాకపోవడంతో తండ్రి శ్రీధర్ ఆమె కోసం వెతికారు. కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు యువ‌తి కోసం గాలింపు మొద‌లెట్టారు.


Next Story