తల్లి చికిత్స కోసం.. కన్యత్వాన్ని అమ్ముకునేందుకు సిద్ధపడిన బాలిక..!

Three women held for trying to push 11 year old girl into flesh trade.కన్నతల్లిని కాపాడుకునేందుకు ఏం చేయాలో తెలియక

By అంజి  Published on  3 Oct 2021 7:59 AM IST
తల్లి చికిత్స కోసం.. కన్యత్వాన్ని అమ్ముకునేందుకు సిద్ధపడిన బాలిక..!

కన్నతల్లిని కాపాడుకునేందుకు ఏం చేయాలో తెలియక కన్యత్వాన్ని పొగొట్టుకునేందుకు సిద్ధమైంది ఓ బాలిక. తన తల్లి క్యాన్సర్‌ వ్యాధితో బాధపడడం చూడలేకపోయింది. చికిత్సకు కావాల్సిన డబ్బుల కోసం ఆ బాలిక.. తన కన్యత్వాన్ని ఐదు వేల రూపాయలకు అమ్మకానికి పెట్టింది. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటు చేసుకుంది. బాలిక తల్లి కొన్ని నెలలుగా క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతోంది. వారిది పేదకుటుంబం కావడంతో ఆస్పత్రిలో చికిత్స చేయించేందుకు డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని గమనించిన ఓ మహిళ బాలికకు మాయమాటలు చెప్పి రోంపిలోకి దింపేందుకు తల్లిని ఒప్పించింది. బాలిక కన్యత్వానికి రూ.5 వేలు వేలకట్టిన ఆ మహిళ బాలికను తనతో తీసుకెళ్లింది.

పుట్టిన రోజు వేడుక పేరుతో కొరాడి ప్రాంతంలోని ఓంనగర్‌లోని ఓ ఇంటికి ఆ బాలికను తీసుకెళ్లింది. ఆ తర్వాత మహిళ అర్చనా వైశంపాయన్‌ మరో ఇద్దరు మహిళలు రంజనా మెష్రామ్, కవితా నిఖారేలు.. రూ.40 వేలకు ఓవ్యక్తితో బాలికను పంపేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అనంతరం బాలికను విటుడి దగ్గరకు పంపారు. ఆ బాలికను చూసిన జాలిపడిన విటుడు.. ఓ స్వచ్ఛంధ సంస్థకు సమాచారం అందించాడు. సదరు సంస్థ సిబ్బంది పోలీసులకు చెప్పడంతో వారు రంగంలోకి దిగారు. సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న ఇంటిపై దాడులు చేసి.. 11 ఏళ్ల బాలికను రక్షించారు. బాలికను ప్రభుత్వ షెల్టర్‌కు తరలించారు. ముగ్గురు మహిళలను సోషల్ సెక్యూరిటీ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై ఐపీసీ 370 (A), 34, 366 (A), 370సెక్షన్లతో పాటు, లైంగిక నేరాల చట్టం కింద కేసులు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. నిందితులు ఎప్పటినుండి ఈ సెక్స్‌రాకెట్‌ నడుపుతున్నారో తెలుసుకునేందుకు తమదైన శైలిలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story