గుంటూరు జిల్లాలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన బైక్.. ముగ్గురు విద్యార్థులు దుర్మరణం
Three Students Died in Road Accident in Guntur District.గుంటూరు జిల్లాలో శుక్రవారం అర్థరాత్రి ఘోర రోడ్డు
By తోట వంశీ కుమార్ Published on
5 Feb 2022 2:38 AM GMT

గుంటూరు జిల్లాలో శుక్రవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లాలోని మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు విద్యార్థులు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
ఘటనాస్థలాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. మృతులను పెనుమాక కు చెందిన షేక్ పై కంబర్, షేక్ రాజా, సతీష్ రెడ్డిలుగా గుర్తించారు. మృతుల కుటుంబాలకు సమాచారం అందించారు. తమ కుమారుల మృతదేహాలను చూసి మృతుల తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు విద్యార్థులు ఎక్కడి నుంచి వస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగిందన్న వివరాలపై ఆరా తీస్తున్నారు. గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు మరణించడంతో పెనుమాక గ్రామంలో విషాదం అలుముకుంది.
Next Story