వ‌రంగ‌ల్‌లో దారుణం.. సొంత అన్న కుటుంబంపై దాడి చేసిన త‌మ్ముడు.. ముగ్గురు మృతి

Three Murdered in one family.ఇటీవ‌ల కాలంలో మాన‌వ‌సంబంధాలు మంట‌గ‌లుస్తున్నాయి. ఆస్తి కోసం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Sep 2021 2:35 AM GMT
వ‌రంగ‌ల్‌లో దారుణం.. సొంత అన్న కుటుంబంపై దాడి చేసిన త‌మ్ముడు.. ముగ్గురు మృతి

ఇటీవ‌ల కాలంలో మాన‌వ‌సంబంధాలు మంట‌గ‌లుస్తున్నాయి. ఆస్తి కోసం క‌న్న త‌ల్లిదండ్రులు, తోడ బుట్టిన వారిని క‌డ‌తేర్చేందుకు వెనుకాడ‌డం లేదు. తాజాగా వ‌రంగ‌ల్ జిల్లాలో దారుణం జ‌రిగింది. ఆర్థిక లావాదేవీల వ్య‌వ‌హారంలో సొంత అన్న కుటుంబంపై క‌త్తితో దాడికి పాల్ప‌డ్డాడు. ముగ్గురుని దారుణంగా హ‌త‌మార్చాడు. తీవ్రంగా గాయ‌ప‌డిన మ‌రో ఇద్ద‌రు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు.

వివ‌రాల్లోకి వెళితే.. వ‌రంగ‌ల్ ప‌ట్ట‌ణంలోని ఎల్బీన‌గ‌ర్‌లో చాంద్ పాషా(50) త‌న కుటుంబంతో క‌లిసి నివసిస్తున్నాడు. త‌మ్ముడు ష‌పితో క‌లిసి గ‌త ఏడాదిగా ప‌శువుల వ్యాపారం చేస్తున్నారు. కాగా.. వీరిద్ద‌రి మ‌ధ్య రూ.కోటి విష‌యంలో గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. దీంతో ఆగ్ర‌హానికి లోనైన ష‌ఫి.. బుధ‌వారం తెల్ల‌వారుజామున అన్న చాంద్‌పాష కుటుంబంపై దాడి చేశాడు. చాంద్‌పాష‌తో పాటు మ‌రికొంద‌రు వ్య‌క్తులు చాంద్‌పాషా ఇంటి త‌లుపుల‌ను క‌ట్ట‌ర్ సాయంతో క‌ట్ చేశారు.

అనంత‌రం నిద్రిస్తున్న చాంద్‌పాషాతో పాటు ఆయ‌న భార్య స‌బీరా బేగం(42), ఖ‌లీల్‌(40) ల‌ను క‌త్తుల‌తో విచ‌క్ష‌ణార‌హితంగా న‌రికారు. దీంతో వారు అక్కిక్క‌డే మృతి చెందారు. వారి కుమారుల‌పై సైతం దాడి చేశారు. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయ‌ప‌డిన కుమారులు ఇద్ద‌రిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృత‌దేహాల‌ను ప‌రిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేపట్టారు. ష‌ఫీనే ఈ దారుణానికి పాల్ప‌డ్డాడ‌ని చాంద్‌పాషా కుమారై పోలీసులకు తెలిపింది.

Next Story
Share it