న‌ల్ల‌గొండ జిల్లాలో రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురు దుర్మ‌ర‌ణం

Three killed six injured in road accident on NH 65.న‌ల్ల‌గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Jan 2023 9:17 AM IST
న‌ల్ల‌గొండ జిల్లాలో రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురు దుర్మ‌ర‌ణం

న‌ల్ల‌గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. హైద‌రాబాద్‌-విజ‌య‌వాడ 65వ జాతీయ ర‌హ‌దారిపై ఆదివారం తెల్ల‌వారుజామున ఓ కారు అదుపుత‌ప్పి ఢివైడ‌ర్‌ను ఢీ కొట్టి బోల్తా ప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. మ‌రో ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా.. వారిని నార్కెట్‌ప‌ల్లిలోని కామినేని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం క‌ట్టంగూరు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృతుల‌ను యాసిన్‌(18), ఇద్దాక్‌(21), స‌మీర్‌(21)గా గుర్తించారు. వీరంతా ఖ‌మ్మం జిల్లా ఖిల్లా బ‌జార్‌కు చెందిన వారు. హైద‌రాబాద్‌లో జ‌రిగిన ఓ వివాహానికి హాజ‌రై తిరిగి ఖ‌మ్మంకు వెలుతుండ‌గా క‌ట్టంగూరు మండ‌లంలోని య‌ర‌సానిగూడెం వ‌ద్ద ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. దీనిపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. డ్రైవ‌ర్ నిద్ర‌మ‌త్తు కార‌ణంగానే ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో కారులో తొమ్మిది మంది ఉన్నారు.

Next Story