ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

చిత్తూరులోని నగరి మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాపురం క్రాస్ రోడ్డు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

By అంజి
Published on : 12 March 2023 3:36 PM IST

road accident, Chittoor district

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

చిత్తూరులోని నగరి మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాపురం క్రాస్ రోడ్డు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, ఆయిల్ ట్యాంకర్ ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. దంపతులతో పాటు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. చిత్తూరు జిల్లా ధర్మాపురం గ్రామ సమీపంలో ఉదయం 8 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని నగరి అర్బన్ పోలీసు అధికారి తెలిపారు. చెన్నై నుంచి తిరుమలకు వెళ్లేందుకు నాగజ్యోతి, యువరాజన్ దంపతులు ప్రైవేట్ వాహనాన్ని అద్దెకు తీసుకున్నారు.

మార్గమధ్యంలో ఇరవై ఏళ్ల వయసున్న డ్రైవర్ కారు అదుపు తప్పి ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టాడు. వీరి వెనుక కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దంపతులు భారత్‌లో నివాసితులు అని, అయితే గత కొంతకాలంగా సింగపూర్‌లో నివసిస్తున్నారని తెలిపారు. కారులో చిక్కుకున్న మృతదేహలను జేసీబీ సహయంతో బయటకు తీశారు. ఈ ఘటనపై నగరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story