చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

Three killed in a serious road accident in Chittoor district. చిత్తూరు జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యుత్‌ స్తంభాన్ని ఇన్నోవా కారు ఢీ కొట్టింది.

By అంజి  Published on  24 July 2022 5:41 AM GMT
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

చిత్తూరు జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యుత్‌ స్తంభాన్ని ఇన్నోవా కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. నాయుడుపేట - పూతలపట్టు నేషనల్‌ హైవేపై పి.కొత్తకోట దగ్గర ఈ ప్రమాదం జరిగింది. కర్ణాటక శివాజీ నగర్ పోలీస్​స్టేషన్‌కు చెందిన ఎస్ఐ అవినాష్‌తో పాటు మరో నలుగురు కానిస్టేబుళ్లు తిరుపతికి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఎస్ఐతో పాటు ఒక కానిస్టేబుల్‌, డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందారు.

అతివేగం కారణంగానే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న చిత్తూరు డీఎస్పీ సుధాకర్‌ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి సీఎంసీ ఆస్పత్రికి తరలించారు. ఓ కేసు విషయమై కర్ణాటక పోలీసులు తిరుపతికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చిత్తూరు డీఎస్పీ తెలిపారు.

Next Story