లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు దుర్మరణం

Three died after car collided with lorry in Vikarabad. వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి లారీని వెనుక

By అంజి
Published on : 13 July 2022 10:40 AM IST

లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు దుర్మరణం

వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటన జిల్లాలోని పూడూరులో ఉన్న స్టీల్‌ ఫ్యాక్టరీ దగ్గర చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణం విడిచారు. ప్రమాదంలో వృద్ధురాలు సహా ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతులను జహిరాబీ (68), జావెద్‌ (12), ఉమర్‌ (6)గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story