హన్మకొండలో అర్ధరాత్రి దారుణం.. మహిళపై ముగ్గురు ఆటోడ్రైవర్లు అత్యాచారం

హన్మకొండ నగరంలో దారుణ ఘటన వెలుగు చూసింది. అర్ధరాత్రి ఇంటికి వెళ్లడానికి ఆటో ఆపిన పాపానికి మహిళపై ముగ్గురు

By అంజి  Published on  30 April 2023 7:30 AM IST
married woman, Hanmakonda, Crime news

హన్మకొండలో అర్ధరాత్రి దారుణం.. మహిళపై ముగ్గురు ఆటోడ్రైవర్లు అత్యాచారం

హన్మకొండ నగరంలో దారుణ ఘటన వెలుగు చూసింది. అర్ధరాత్రి ఇంటికి వెళ్లడానికి ఆటో ఆపిన పాపానికి మహిళపై ముగ్గురు ఆటో డ్రైవర్‌ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన హన్మకొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని నయీంనగర్‌లో నివసిస్తున్న ఓ వివాహిత ఈ నెల 27వ తేదీన పని మీద బయటకు వెళ్లింది. తిరిగి రాత్రి 12 గంటల సమయంలో ఇంటికి వెళ్లడానికి బయల్దేరింది. నైట్‌ కేయూ క్రాస్‌ వద్ద ఓ ఆటోను ఆపి తనను రంగ్‌బార్‌ దగ్గర దించాలని డ్రైవర్‌ను కోరింది. మహిళను ఆటో ఎక్కించుకున్న డ్రైవర్‌.. కాసేపటికే తన ఫ్రెండ్స్‌ ఫోన్‌ చేసి మార్గం మధ్యలో ఆటో ఎక్కించుకున్నాడు.

మహిళను నయీంనగర్‌కు కాకుండా భీమారం వైపు తీసుకెళ్లారు. దీంతో మహిళకు అనుమానం వచ్చింది. తనను ఎటు తీసుకెళ్తున్నారంటూ ఆమె అరవడంతో.. డ్రైవర్‌ రాకేష్‌ ఫ్రెండ్స్‌ అరవొద్దంటూ బెదిరింపులకు దిగారు. ఆ వెంటనే ఆటోను భీమారం గ్రామ శివారులోకి తీసుకెళ్లి ఆటో సౌండ్‌ బాక్స్‌ శబ్దం బాగా పెంచి.. ఆటోనే మహిళపై ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత మహిళను రంగ్‌బార్‌ దగ్గర వదిలేసి వెళ్లిపోయారు. ఇంటికి వెళ్లిన మహిళ జరిగిన తన ఇంట్లో వారికి చెప్పింది. కుటుంబ సభ్యులు హనుమకొండ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. మహిళకు వైద్య పరీక్షలు చేయించారు. పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Next Story