హాస్టల్‌లో యువతి ఆత్మహత్య.. గ్రూప్‌-4లో మార్కులు తక్కువ వచ్చాయని..

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్‌ కమిషన్‌ ఇటీవల ప్రకటించిన గ్రూప్‌-4 పరీక్ష ఫలితాల్లో మార్కులు తక్కువగా వచ్చాయని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది.

By అంజి
Published on : 17 Feb 2024 8:26 AM IST

young woman, suicide, Group 4, Telangana

హాస్టల్‌లో యువతి ఆత్మహత్య.. గ్రూప్‌-4లో మార్కులు తక్కువ వచ్చాయని..  

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ఇటీవల ప్రకటించిన గ్రూప్‌-4 పరీక్ష ఫలితాల్లో మార్కులు తక్కువగా వచ్చాయని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని జవహర్‌నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రైవేట్‌ హాస్టల్‌లో ఉంటున్న శిరీష (24) గ్రూప్ ఫోర్‌లో మార్కులు తక్కువ వచ్చాయని ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడిందని సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.

యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువతి స్వస్థలం మహబూబాబాద్‌ జిల్లా ముప్పారం గ్రామంగా గుర్తించారు. శిరీష గ్రూప్ 4లో మార్కులు తక్కువ వచ్చినందుకు ఆత్మహత్య చేసుకుందా లేక మరి ఏమైనా కారణాలు ఉన్నాయా, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుందా అన్న కోణంలో చిక్కడపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story