పవన్ కళ్యాణ్ హఠావో బుక్ రచయిత శ్రీనివాస్ మరణంపై వీడిన మిస్టరీ

ఖమ్మం జిల్లాలో సంచలనం సృష్టించిన "పవన్ కళ్యాణ్ హఠావో" పుస్తక రచయిత బొగ్గుల శ్రీనివాస్ మరణం వెనుక ఉన్న అసలు మిస్టరీని పోలీసులు ఛేదించారు

By -  Knakam Karthik
Published on : 22 Feb 2026 4:37 PM IST

Telangana, Khammam District, Boggula Srinivas, YouTuber Murder, GST Fraud, Telangana Police

పవన్ కళ్యాణ్ హఠావో బుక్ రచయిత శ్రీనివాస్ మరణంపై వీడిన మిస్టరీ

ఖమ్మం జిల్లాలో సంచలనం సృష్టించిన "పవన్ కళ్యాణ్ హఠావో" పుస్తక రచయిత బొగ్గుల శ్రీనివాస్ మరణం వెనుక ఉన్న అసలు మిస్టరీని పోలీసులు ఛేదించారు. శ్రీనివాస్‌ది ప్రమాదం కాదని, అది పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్య అని నిర్ధారిస్తూ.. ఈ కేసులో ప్రధాన నిందితుడు వేణుమాధవ్ రెడ్డితో పాటు మరో ముగ్గురు సుపారీ గ్యాంగ్ సభ్యులను కూసుమంచి పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసుల దర్యాప్తు ప్రకారం, శ్రీనివాస్ మరియు వేణుమాధవ్ రెడ్డిల మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీలే ఈ హత్యకు ప్రధాన కారణం. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య జీఎస్టీ మోసాలకు సంబంధించిన లాభాల పంపిణీ విషయంలో తీవ్ర వివాదాలు నడుస్తున్నాయి. శ్రీనివాస్ నుంచి ఒత్తిడి పెరగడంతో, అతడిని అడ్డుతొలగించుకోవాలని భావించిన వేణుమాధవ్ రెడ్డి రూ. 5 లక్షల సుపారీ ఇచ్చి హతమార్చాడు. నార్కట్‌పల్లి - నకిరేకల్ మధ్య శ్రీనివాస్‌ను దారుణంగా హత్య చేసిన నిందితులు, ఆపై మృతదేహాన్ని పాలేరు రిజర్వాయర్‌లో పడేశారు. ఈ ఘటనను కారు ప్రమాదంగా చిత్రీకరించేందుకు నిందితులు విఫలయత్నం చేసినట్లు పోలీసులు గుర్తించారు.

అయితే, ఈ హత్యకు శ్రీనివాస్ రాసిన "పవన్ కళ్యాణ్ హఠావో" పుస్తకానికి ఎలాంటి సంబంధం లేదని ఖమ్మం పోలీసులు స్పష్టం చేశారు. కేవలం ఆర్థిక గొడవలే ఈ ఘాతుకానికి దారితీశాయని, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని వారు తేల్చి చెప్పారు.

Next Story