టెక్కీ విజయారెడ్డి సూసైడ్ కేసులో వీడిన మిస్టరీ..ఫోరెన్సిక్ రిపోర్ట్‌లో ఏముందంటే?

విజయారెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ప్రభుత్వ రైల్వే పోలీసులు (GRP) ఇన్వెస్టిగేషన్ పూర్తి చేశారు.

By -  Knakam Karthik
Published on : 19 Feb 2026 4:45 PM IST

Suicide Case,  Vijaya Reddy, Hyderabad, Charlapalli Mystery, Tech Professional, Charlapalli Tragedy, Government Railway Police

టెక్కీ విజయారెడ్డి సూసైడ్ కేసులో వీడిన మిస్టరీ..ఫోరెన్సిక్ రిపోర్ట్‌లో ఏముందంటే?

హైదరాబాద్‌: జనవరి 31 రాత్రి చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో టెక్ ప్రొఫెషనల్ విజయారెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ప్రభుత్వ రైల్వే పోలీసులు (GRP) ఇన్వెస్టిగేషన్ పూర్తి చేశారు. ఈ కేసులో ఎటువంటి అనుమానాస్పద కోణాలు లేవని పోలీసులు స్పష్టం చేశారు.

దర్యాప్తులో వెలుగుచూసిన కీలక ఆధారాలు:

సీసీటీవీ & లోకో పైలట్ సాక్ష్యం: అర్ధరాత్రి సమయంలో విజయారెడ్డి తన పిల్లలతో కలిసి పట్టాలపైకి వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజ్ లభించింది. పట్టాలపై ఆ ముగ్గురు తప్ప మరెవరూ లేరని లోకో పైలట్ కూడా వాంగ్మూలం ఇచ్చారు. ఘటనా స్థలంలో లభించిన లేఖను విజయారెడ్డి స్వయంగా రాసినట్లు ఆమె సోదరుడు ధృవీకరించారు. ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా విజయారెడ్డి మొబైల్, ల్యాప్‌టాప్‌లలో డిలీట్ చేసిన చాట్‌లను పోలీసులు రికవరీ చేశారు. వీటి విశ్లేషణలో బాహ్య వ్యక్తుల ప్రమేయం లేదా బెదిరింపులు ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదు.

తీవ్రమైన మానసిక క్షోభే కారణమా?

విజయారెడ్డి భర్త దుబాయ్‌లో ఉండటం, పిల్లలు హాస్టల్స్‌లో చదువుతుండటంతో ఆమె గత రెండు నెలలుగా తీవ్రమైన ఒంటరితనంతో బాధపడుతున్నట్లు స్నేహితుల వాంగ్మూలం ద్వారా తెలిసింది. ఆర్థిక సమస్యలు లేకపోయినప్పటికీ, తను లేకపోతే పిల్లలు అనాథలవుతారనే ఆందోళనతో ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. ఈ తీవ్ర మానసిక ఆందోళన వల్లే ఆమె తన పిల్లలతో కలిసి 'ఆత్మహత్య ఒప్పందం' (Suicide Pact) చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. కుటుంబ సభ్యులు కూడా ఎవరిపై అనుమానం లేదని తెలపడంతో, ఈ కేసును ఆత్మహత్యగానే పరిగణిస్తూ పోలీసులు దర్యాప్తును ముగించారు.

Next Story