తిరుమల శ్రీవారి ఆలయం వెనుక భక్తుడి దారుణ హత్య

The murder of a devotee in tirumala. తిరుమలలో శ్రీవారి భక్తుడి హత్య కలకలం రేపుతోంది. శ్రీవారి ఆలయం వెనుక ఉన్న గోవింద నిలయం మ్యూజియం

By అంజి  Published on  21 July 2022 11:52 AM IST
తిరుమల శ్రీవారి ఆలయం వెనుక భక్తుడి దారుణ హత్య

తిరుమలలో శ్రీవారి భక్తుడి హత్య కలకలం రేపుతోంది. శ్రీవారి ఆలయం వెనుక ఉన్న గోవింద నిలయం మ్యూజియం దగ్గర బుధవారం అర్ధరాత్రి ఓ మృతదేహం కనిపించింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. సీసీ ఫుటేజ్‌ను పరిశీలించారు. నిద్రిస్తున్న సమయంలో ఆ వ్యక్తిపై బండరాయితో మోది గుర్తు తెలియని వ్యక్తి హత్య చేశాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సీసీటీవీ ఫుటేజ్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. హత్య జరిగిన 2 గంటల్లోనే వన్‌టౌన్‌ పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. హత్యకు గురైన వ్యక్తి తమిళనాడుకు చెందిన భాస్కర్‌గా పోలీసులు గుర్తించారు. హత్యకు పాల్పడిన కందస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసులో మరో వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

Next Story