టైమ్‌కు భోజనం పెట్టలేదని.. కూతురిని కొడవలితో నరికి చంపిన తండ్రి

The father killed his daughter with a machete for not giving her lunch on time. ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. భోజనం అందించడంలో జాప్యం చేసిందన్న కారణంతో 21 ఏళ్ల తన

By అంజి  Published on  28 Aug 2022 12:20 PM IST
టైమ్‌కు భోజనం పెట్టలేదని.. కూతురిని కొడవలితో నరికి చంపిన తండ్రి

ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. భోజనం అందించడంలో జాప్యం చేసిందన్న కారణంతో 21 ఏళ్ల తన కుమార్తెను తండ్రి దారుణంగా హతమర్చాడు. ఈ ఘటనకు సంబంధించిన నిందితుడిని హాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరుగురు పిల్లల తండ్రి అయిన మహ్మద్ ఫరియాద్ (55) తన కుమార్తె రేష్మతో భోజనం వడ్డించడంలో ఆలస్యం కావడంతో వాగ్వాదానికి దిగాడు. పేరు చెప్పడానికి ఇష్టపడని పొరుగింటి వ్యక్తి చెప్పిన దాని ప్రకారం.. తండ్రి కూతురిపై అరవడం ప్రారంభించడంతో బాలిక కోపంగా బదులిచ్చింది.

ఈ క్రమంలోనే కోపంతో గడ్డి కోసేందుకు ఉపయోగించే పదునైన కొడవలిని తీసుకుని కుమార్తెపై దాడి చేశాడు. ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడైన తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. అదనపు పోలీసు సూపరింటెండెంట్ ముఖేష్ చంద్ర మాట్లాడుతూ.. ''బాబుగర్ పోలీస్ స్టేషన్‌లో ఐపిసి సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేయబడింది. మృతదేహాన్ని కూడా పోస్టుమార్టంకు తరలించారు. విచారణ కొనసాగుతోంది. నిందితుడిని మేజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తాం'' అని చెప్పారు.

కూతురు రేష్మ వివాహం సెప్టెంబర్ 4న జరగాల్సి ఉండగా.. అంతలోనే తండ్రి ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు.

Next Story