ఘట్‌కేసర్‌లో కిడ్నాపైన చిన్నారి సురక్షితం

మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లో చిన్నారి కిడ్నాప్‌ ఘటన కలకలం రేపింది. అయితే కిడ్నాప్‌కు గురైన చిన్నారిని కిడ్నాపర్‌ నుంచి పోలీసులు రక్షించారు.

By అంజి  Published on  6 July 2023 12:24 PM IST
kidnap, Ghatkesar, Child safe, Hyderabad

ఘట్‌కేసర్‌లో కిడ్నాపైన చిన్నారి సురక్షితం

మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లో బుధవారం రాత్రి నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్‌ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అయితే కిడ్నాప్‌కు గురైన చిన్నారిని కిడ్నాపర్‌ నుంచి పోలీసులు రక్షించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో బాలిక ఆచూకీ లభ్యమైంది. వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్‌లోని ఈడబ్ల్యూఎస్ కాలనీలో ఇంటిముందు ఆడుకుంటూ చిన్నారి కనిపించికుండా పోయింది. బాలిక క్రిష్ణవేణి రాత్రి షాప్‌కు వెళ్లి తిరిగి ఇల్లు చేరలేదు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందారు. ఎంత వెతికినా కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు బృందాలుగా ఏర్పడి బాలిక కోసం విస్తృత గాలింపు చేపట్టారు.

సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పోలీసులు గుర్తించారు. ఎట్టకేలకు కిడ్నాపర్ నుంచి బాలికను పోలీసులు కాపాడారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. పాపను అమ్మే ప్రయత్నంలో.. వేరే ప్రాంతాలకు వెళ్లడానికి సురేష్ ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే, సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా 15 గంటల వ్యవధిలో పోలీసులు చిన్నారిని సురక్షితంగా కాపాడారు. కిడ్నాపర్‌.. పాప ఏడవకుండా ఉండడానికి పాపకు చాక్లెట్ ఇచ్చి.. ఎత్తుకునిపోయాడు. సురేష్ రాత్రి 8 గంటల సమయంలో కిరాణా షాప్ దగ్గరికి వచ్చాడు. అదే సమయంలో పాప చాక్లెట్ కొనుక్కోవడానికి వెళ్లింది. స్థానికులు పాపను సురేష్ తీసుకెళ్లడం చూశామని పోలీసులకు చెప్పారు. సురేష్ గతంలో కాలేజీలో పనిచేసిన సమయంలోనూ, సినిమా థియేటర్లో పనిచేసే సమయంలోనూ అమ్మాయిలను కిడ్నాప్ చేశాడని అంటున్నారు.

Next Story