ఘోరం.. కోడ‌లి ర‌క్తం తీసి మంత్ర‌గాడికి అమ్మిన అత్త‌.. రూ.50వేలు

కోడ‌లిని కూతురిలాగా చూసుకోవాల్సిన అత్త‌మామ‌లు దారుణానికి ఒడిగ‌ట్టాడు. బంధించి కోడ‌లి రుతుక్ర‌మ ర‌క్తాన్ని విక్ర‌యించారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 March 2023 8:45 AM IST
Menstrual Blood, Pune

ప్ర‌తీకాత్మ‌క చిత్రం



కోడ‌లిని కూతురిలాగా చూసుకోవాల్సిన అత్త‌మామ‌లు దారుణానికి ఒడిగ‌ట్టాడు. బంధించి కోడ‌లి రుతుక్ర‌మ ర‌క్తాన్ని ఓ మాంత్రికుడికి రూ.50వేల‌కు విక్ర‌యించారు. ఈ దారుణ ఘ‌ట‌న మ‌హారాష్ట్రలోని బీడ్‌లోని సౌంద‌నా గ్రామంలో జ‌రిగింది.

పూణెలోని విశ్రాంతంవాడికి చెందిన 27 ఏళ్ల మ‌హిళ రెండు సంవ‌త్స‌రాల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. త‌న భ‌ర్త‌తో క‌లిసి బీడ్ జిల్లాలోని సౌంద‌నా గ్రామంలో అత్త‌మామ‌లతో క‌లిసి నివ‌సించేందుకు వెళ్లింది. కొద్ది రోజుల పాటు అంతా బాగానే ఉంది. 2022 ఆగ‌స్టులో అత్త‌మామ‌లు ఘోరానికి పాల్ప‌డ్డాడు. రుత్రుస్రావం త‌రువాత ఆమె చేతులు, కాళ్లు క‌ట్టేసిన అత్త‌మామ‌లు బ‌హిష్ట ర‌క్తాన్ని దూదితో సేక‌రించి సీసాలో నింపారు.

ఆ ర‌క్తాన్ని మంత్ర విద్య‌లు చేసే ఓ మాంత్రగాడికి రూ.50వేల‌కు అమ్మారు. పుట్టింటికి వ‌చ్చిన బాధితులు జ‌రిగిన విష‌యాన్ని త‌న తల్లిదండ్రుల‌కు తెలియ‌జేసింది. ఓ ఎన్జీవో సాయంతో విశ్రాంతివాడి పోలీసుల‌ను ఆశ్ర‌యించింది.

శివసేన (యుబిటి) ఎమ్మెల్సీ మనీషా కయాండే మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో ఈ అంశాన్ని లేవనెత్తారు. నేరానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వ్యంగ్యంగా వెలుగులోకి వచ్చింది.

మహిళ తల్లి కుటుంబీకుల జోక్యంతో పూణేలోని విశ్రాంత్‌వాడి పోలీస్ స్టేషన్ బాధితురాలి భర్త మరియు అతని తల్లిదండ్రులతో సహా నిందితులపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని ఆమె చెప్పారు.

Next Story