అంత్య‌క్రియ‌ల్లో విషాదం.. పాడె మోస్తూ ముగ్గురు మృతి

Terrible Tragedy in Tambaganipalle of Kuppam Mandal of Chittoor District. చిత్తూరు జిల్లా కుప్పం మండలం తంబగానిపల్లెలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

By Medi Samrat  Published on  16 Jun 2023 8:37 PM IST
అంత్య‌క్రియ‌ల్లో విషాదం.. పాడె మోస్తూ ముగ్గురు మృతి

చిత్తూరు జిల్లా కుప్పం మండలం తంబగానిపల్లెలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చనిపోయిన మహిళ అంత్యక్రియలు నిర్వహించేందుకు మృతదేహాన్నితీసుకెళ్తుండగా పాడెకు విద్యుత్ తీగలు తగిలి ముగ్గురు మృతి చెందారు. ఈ ఘ‌ట‌న‌లో మరో ముగ్గురికి గాయాలవ‌గా ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని శ్మశానికి తీసుకెళ్లే సమయంలో కరెంట్ స్తంభం నుంచి వేలాడుతున్న విద్యుత్ తీగలు పాడెకు తగిలి పాడే మోస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను తిరుపతి, రవీంద్రన్, మునప్పగా గుర్తించారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కుప్పం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


Next Story