నమ్మించి మోసం.. స్నేహితురాలి కళ్ల ముందే బాలిక‌పై గ్యాంగ్‌ రేప్‌.. ఆ రాత్రంతా..

Terrible incident.. Mumbai woman gets 3 men to rape 11-year-old friend. దేశ వాణిజ్య రాజధానిలో దారుణ ఘటన వెలుగు చూసింది. తన సమక్షంలో.. తన స్నేహితురాలి(11)పై అత్యాచారానికి

By అంజి  Published on  19 Aug 2022 1:59 PM IST
నమ్మించి మోసం.. స్నేహితురాలి కళ్ల ముందే బాలిక‌పై గ్యాంగ్‌ రేప్‌.. ఆ రాత్రంతా..

దేశ వాణిజ్య రాజధానిలో దారుణ ఘటన వెలుగు చూసింది. తన సమక్షంలో.. తన స్నేహితురాలి(11)పై అత్యాచారానికి పాల్పడేలా ముగ్గురు వ్యక్తులను యువతి (21) ప్రేరేపించింది. ముంబైలోని విరార్‌ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఈ ఘటన.. స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నిందితుల్లో ముగ్గురు సహా మహిళా స్నేహితురాలిని ఆరు గంటల్లో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆగస్టు 16న మంగళవారం సాయంత్రం 7 గంటల సమయంలో బాలిక తన సెల్‌ఫోన్‌ రిపేర్‌ చేయించుకోవడం కోసం తన ఇంటికి సమీపంలో ఉన్న మొబైల్‌ షాపుకు వెళ్లింది.

అదే సమయంలో దారిలో తన 21 ఏళ్ల మహిళా స్నేహితురాలిని కలుసుకుంది. ఈ క్రమంలోనే బాలికను ఆ యువతి షికారుకు తీసుకువెల్లింది. యువతి బాలికను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి, ఆమె ముగ్గురు స్నేహితులను ఫోన్‌ చేసి రప్పించింది. అర్ధరాత్రి దాటాక నిర్మానుష్య స్థలానికి చేరుకున్న వారు బాలికను రాబోయే గణేష్ ఉత్సవాల కోసం ఏర్పాటు చేసిన మంటపం వెనుక ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లి నిర్బంధించారు. యువతి బాలికను బెదిరించి.. ఒకరితో లైంగిక సంబంధం పెట్టుకోమంది. ఈ క్రమంలోనే బాలికపై ఇద్దరు వ్యక్తులు వంతులవారీగా బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

బాలికపై లైంగిక దాడి జరుగుతుండగా.. స్నేహితురాలు పైశాచిక ఆనందం పొందింది. ఆ తర్వాత బుధవారం తెల్లవారుజామున బాధితురాలిని ఇంటి దగ్గర పడేసి వెళ్లిపోయారు. బాధితురాలు ఇంటికి చేరుకుని జరిగిన సంఘటనను వివరించడంతో, ఆమె తల్లి విరార్ పోలీసులను ఆశ్రయించింది. వారు నిందితులను పట్టుకోవడానికి బృందాలను ఏర్పాటు చేశారు. బాధితురాలి స్నేహితురాలిని పోలీసులు ఆరా తీశారు. నిందితుల్లో ఒకరు కళాశాల విద్యార్థి కాగా, మరొకరు కూరగాయల వ్యాపారి, మూడో నిందితుడు డ్ర‌గ్ డీల‌ర్ అని పోలీసులు చెప్పారు. నిందితులపై ఐపీసీ సెక్షన్ల కింద సామూహిక అత్యాచారం, అసహజ సెక్స్, పోక్సో సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వారిని పోలీసు కస్టడీకి తరలించారు.

Next Story