నాన్న అని అనడానికే అసహ్యం వేస్తోంది.. ఐ హేట్ మై డాడ్.. పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య
Tenth Class student committed suicide in Rangareddy.పదో తరగతి పరీక్షలు రాయాల్సిన ఓ విద్యార్థిని పరీక్షలకు ఒక
By తోట వంశీ కుమార్
పదో తరగతి పరీక్షలు రాయాల్సిన ఓ విద్యార్థిని పరీక్షలకు ఒక రోజు ముందు ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి మరణించినప్పటి నుంచి తండ్రి తాగొచ్చి నరకం చూపిస్తుండడంతో వేదింపులకు తాళలేక బలవన్మరణానికి పాల్పడింది. మా డాడీని నాన్న అని పిలవాలంటేనే అసహ్యం వేస్తోంది. మూడు సార్లు ఉరి వేసుకున్నా.. ఎవరో ఒకరు కాపాడారు. ఇంకొన్ని రోజుల్లో నా చావు వార్త అందరికీ తెలుస్తుంది అంటూ ఓ లేఖను గతంలోనే రాసుకుంది. ఈ హృదయ విదారక ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. నందిగామ మండలం బుగ్గోనిగూడలో మొగిలిగిద్ద నర్సింహ,లలిత దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఓ కుమారుడు శ్రవణ్, పదో తరగతి చదువుతున్న కుమారై మనీషా(16). కాగా.. లలిత ఏడాది క్రితం మరణించింది. అప్పటి నుంచి నర్సింహ తాగుడుకు బానిస అయ్యాడు. తాగి వచ్చి నిత్యం కుమారై, కుమారుడితో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో కుమారుడు తాను పనిచేసే ఉంటున్నాడు. ఇదే అదనుగా భావించిన నర్సింహ తన కూతురును మరింత వేధింపులకు గురిచేసేవాడు.
నిత్యం తండ్రి వేధింపులు అధికం అవుతుండడంతో మనీషా తీవ్ర మనస్థాపానికి గురైంది. ఆదివారం ఇంట్లో ఉరివేసుకుంది. మద్యాహ్నం తండ్రి.. కుమారుడు శ్రవణ్‌కు ఫోన్ చేసి చెల్లలు ఇంట్లో దూలానికి ఉరివేసుకుందని చెప్పాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. శ్రవణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఘటనాస్థలంలో ఓ పుస్తకంలో 'ఐ హేట్ మై డ్యాడ్' అని నాలుగు సార్లు రాసి ఉంది.' అమ్మ అంటే చాలా ఇష్టం. మా నాన్న మంచివాడు కాదు, దరిద్రుడు, గలీజో డు. నాన్న అని పిలవడానికి కూడా చాలా అసహ్యం వేస్తోంది. నాన్నను చంపాలని ఉంది. లేదా నేనన్నా చావాలని ఉంది. ఐ యాం వెయింటింగ్ ఫర్ డెత్' అని లేఖ రాసి ఉంది.