అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెనాలికి చెందిన 26 ఏళ్ల యువతి మృతి చెందింది. మృతురాలు పరిమళగా గుర్తించారు. 2022 డిసెంబర్‌లో తన ఎంఎస్‌ను అభ్యసించేందుకు అమెరికా వెళ్లి టేనస్సీలో నివాసం ఉంటోంది. ఆమె ప్రయాణిస్తున్న కారు ట్రక్కును ఢీకొనడంతో ఆమె మృతి చెందింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న మరో ఇద్దరు నికిత్, పవన్‌లకు గాయాలయ్యాయి.
తెనాలి పట్టణానికి చెందిన వ్యాపారి గణేశ్-రమాదేవి దంపతుల కుమార్తె నాగశ్రీవందన పరిమళ ఎంఎస్ చేసేందుకు రెండేళ్ల క్రితం అమెరికా వెళ్ళింది. పరిమళ మృతి విషయం తెలిసి తెనాలిలోని ఆమె ఇంటి వద్ద విషాదం అలముకుంది. పరిమళ మృతదేహాన్ని వీలైనంత త్వరగా తెనాలి పంపేందుకు ‘తానా’ ప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు.