గంజాయితో పోలీసులకు పట్టుబడ్డ యూట్యూబర్ షణ్ముక్

ప్రముఖ తెలుగు యూట్యూబర్, బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఒక కేసు విష‌యంలో పోలీసులు షణ్ముఖ్ ఇంటికి వెళ్లారు.

By అంజి  Published on  22 Feb 2024 12:44 PM IST
Telugu Youtuber, Shanmukh Jaswant, Arrest, Ganja Case

గంజాయితో పోలీసులకు పట్టుబడ్డ యూట్యూబర్ షణ్ముక్

ప్రముఖ తెలుగు యూట్యూబర్, బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఒక కేసు విష‌యంలో పోలీసులు షణ్ముఖ్ ఇంటికి వెళ్లారు. అయితే అక్క‌డ గంజాయి తీసుకుంటూ పట్టుబడ్డాడు షణ్ముఖ్‌. దీంతో అతడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకెళితే.. ఓ యువతిని మోసం చేసి.. మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్‌. షణ్ముక్ అన్న సంపత్ వినయ్‌కు ఏపీకి చెందిన ఓ యువతితో మూడేళ్ల క్రితం నిశ్చితార్ధం అయింది. అయితే అప్పటి నుంచి పలు కారణాల వల్ల పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలోనే ఇటీవల మళ్లీ ముహూర్తం కుదుర్చుకోగా.. మరో ఆరు రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది.

అంతలోనే సంపత్ వినయ్ ఆమెను మోసం చేసి మరో యువతిని వివాహం చేసుకున్నాడు. దీంతో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసుపై సంపత్ వినయ్‌ను ప్రశ్నించేందుకు పోలీసులు షణ్ముఖ్ ఇంటికి వెళ్లారు. అక్క‌డ గంజాయి తీసుకుంటూ పట్టుబడ్డాడు షణ్ముఖ్‌. దీంతో గంజాయి కేసులో అతడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. షణ్ముఖ్‌తో పాటు అతడి సోదరుడు సంపత్ వినయ్‌ని కూడా మరో కేసులో అరెస్ట్ చేశారు. షణ్ముక్ అన్న సంపత్ వినయ్ వద్ద 16 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. షణ్ముఖ్ అరెస్టు కావడం ఇది తొలిసారి కాదు. గతంలో హిట్ అండ్ రన్ కేసులో అరెస్టు అయ్యి జైలు నుండి విడుదలయ్యాడు.

Next Story