హైదరాబాద్: తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఓ వ్యక్తి ఆదివారం ఆమెను క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపాడని పోలీసులు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్ పట్టణంలో ఈ దారుణ సంఘటన జరిగింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నిందితుడు రియల్ ఎస్టేట్ వ్యాపారి, అతని భార్య, సహకార బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్. భర్త వెంకట బ్రహ్మయ్య.. తన భార్య కృష్ణవేణికి వివాహేతర సంబంధం ఉందనే అనుమానం వ్యక్తం చేశాడు.
కొంతకాలంగా అనుమానంతో భార్యను బ్రహ్మయ్య వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే దంపతలు వారి నివాసంలో గొడవ పడ్డారని తెలుస్తోంది. "వాదన సమయంలో, ఆ వ్యక్తి తన భార్యపై క్రికెట్ బ్యాట్‌తో దాడి చేశాడు, ఫలితంగా ఆమె అక్కడికక్కడే మరణించింది" అని ఒక పోలీసు అధికారి తెలిపారు. అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు నమోదు చేసి, నిందితుడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.