60 ఏళ్ల వృద్ధుడు పెళ్లికి నిరాకరించడంతో.. 18 ఏళ్ల యువతి ఆత్మహత్య

హైదరాబాద్ దుండిగల్‌లోని 60 ఏళ్ల వృద్ధుడు తనతో పెళ్లికి నిరాకరించడంతో 18 ఏళ్ల యువతి తన ఇంట్లోనే ఉరేసుకుంది.

By అంజి  Published on  21 Sept 2023 8:54 AM IST
Dundigal, Crime news,  Bahadurpally,marriage

60 ఏళ్ల వృద్ధుడు పెళ్లికి నిరాకరించడంతో.. 18 ఏళ్ల యువతి ఆత్మహత్య

హైదరాబాద్: దుండిగల్‌లోని 60 ఏళ్ల వృద్ధుడు తనతో పెళ్లికి నిరాకరించడంతో 18 ఏళ్ల యువతి తన ఇంట్లోనే ఉరేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి దుండిగల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బహదూర్‌పల్లి ఇందిరమ్మ కాలనీలోని తన ఇంటి వద్ద మంగళవారం అర్థరాత్రి బాధితురాలు జి.పూజిత ఆత్మహత్యకు ఒడిగట్టింది. పూజిత ఏడు నెలల క్రితం సలీమ్‌ అనే వృద్ధుడితో సన్నిహిత సంబంధాన్ని పెంచుకుంది. ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడి రెండు నెలల క్రితమే గర్భం దాల్చింది. బహదూర్‌పల్లిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో అబార్షన్‌ చేయించుకోవాలని సలీమ్‌ ఆమెను ఒప్పించాడని దుండిగల్‌ పోలీసు అధికారి తెలిపారు.

గత మూడు వారాలుగా సలీమ్‌తో వివాహం జరిపించాలని తల్లిదండ్రులు జి.సరోజ, కుశింరుడులను పూజిత ఒత్తిడి చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. వలస కూలీలైన ఆమె తల్లిదండ్రులు దీనిని వ్యతిరేకించారు. వయస్సు తేడాతో పాటు, సలీమ్‌కు అప్పటికే వివాహమైందని చెప్పారు. రెండు వారాల క్రితం ఆమె సలీమ్‌కు ప్రపోజ్ చేసి, తనను పెళ్లి చేసుకోవాలని కోరగా అతను నిరాకరించాడు. దీంతో యువతి ఆత్మహత్య చేసుకుంది. దుండిగల్ పోలీసులు సలీమ్‌పై ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Next Story