బిల్డింగ్‌పై నుంచి పడి బాలిక మృతి.. యువకుడు దారుణ హత్య

Teenage girl dies after falling from building in Hyderabad. హైదరాబాద్‌లోని కుషాయిగూడలో భవనంపై నుంచి పడి 14 ఏళ్ల బాలిక మృతి చెందింది.

By అంజి
Published on : 16 Jan 2023 10:01 AM IST

బిల్డింగ్‌పై నుంచి పడి బాలిక మృతి.. యువకుడు దారుణ హత్య

హైదరాబాద్‌లోని కుషాయిగూడలో భవనంపై నుంచి పడి 14 ఏళ్ల బాలిక మృతి చెందింది. శనివారం తెల్లవారుజామున బాలిక రంగోలి ఫోటోను క్లిక్ చేయడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న పొలిశెట్టి కినారా అనే బాలిక కుషాయిగూడలోని శారదానగర్‌లో ఉన్న తన అపార్ట్‌మెంట్ ముందు రంగోలి డిజైన్ చేసింది. తర్వాత ఆ అమ్మాయి రంగోలి యొక్క టాప్-యాంగిల్ ఫోటోగ్రాఫ్ క్లిక్ చేయడానికి అపార్ట్‌మెంట్‌ ఐదవ ఫ్లోర్‌కి వెళ్లింది. ఫొటోలను క్లిక్ చేస్తుండగా, బాలిక భవనం ఐదవ అంతస్తు నుండి జారి పడిపోయింది. ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతదేహానికి గాంధీ ఆస్పత్రి మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు.

ఇదిలా ఉంటే.. నగరంలోని లంగ‌ర్ హౌస్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఓ యువ‌కుడు దారుణ హత్య‌కు గుర‌య్యాడు. మోతీ ద‌ర్వాజా, జీఎంకే ఫంక్ష‌న్ హాల్ ఎదురుగా యువకుడిని కొంద‌రు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు న‌రికి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడిని ఉప్ప‌ల్‌కు చెందిన క‌లీమ్‌(25)గా గుర్తించారు. మరోవైపు క‌లీమ్‌ను హ‌త్య చేసింది తామే అంటూ ముగ్గురు వ్య‌క్తులు గోల్కొండ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story