తమిళనాడులో దారుణ ఘటన చోటు చేసుకుంది. బేబీ కేర్ టేకర్‌గా పనిచేస్తున్న 15 ఏళ్ల బాలికను చిత్రహింసలకు గురిచేసి కొట్టి చంపారు దంపతులు. ఈ క్రమంలోనే బాలికను పనిలో పెట్టుకున్న దంపతులతో సహా ఆరుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. పోక్సో చట్టాన్ని కూడా పోలీసులు ప్రయోగించినప్పటికీ, సంబంధిత సమాచారం వెంటనే తెలియలేదు.
తంజావూరుకు చెందిన బాలిక మృతదేహంలో చిత్రహింసలకు సంబంధించిన గుర్తులు, గాయాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. సుమారు మూడు నెలల పాటు ఆ బాలిక వేధింపులకు గురైంది. ఆమె అక్టోబరు 31, 2024న దాడికి గురై మరణించింది. నగర పోలీసు తెలిపిన వివరాల ప్రకారం.. దంపతులు నివేదా అలియాస్ నాజియా (30), ఆమె భర్త మహమ్మద్ నిషాద్ (36) అరెస్టు చేశారు. నిషాద్ సోదరి సీమాబేగం (39), దంపతుల స్నేహితుడు లోకేష్ (26), అతని భార్య జయశక్తి (24), ఇంటి పనిమనిషి (40) మహేశ్వరిని కూడా అరెస్టు చేశారు.
ఆరుగురు నిందితులను కోర్టు ముందు హాజరుపరచగా, వారిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించిన తర్వాత జైలులో ఉంచారు. సంబంధిత చట్టాల కింద అభియోగాలు పోక్సో చట్టం, హత్య కింద నేరాలకు సంబంధించినవి. 15 ఏళ్ల బాలిక నిషాద్ ఇంట్లో 2023 డిసెంబర్ నుంచి బేబీ సిటర్‌గా పనిచేస్తోంది.