తల్లి మద్యం కోసం డబ్బులు ఇవ్వలేదని.. యువకుడు ఆత్మహత్య

కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ విషాద ఘటన చోటు చేసుకుంది. మద్యం కొనుగోలుకు తల్లి నగదు ఇవ్వకపోవడంతో మనస్థాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

By అంజి
Published on : 27 March 2024 8:43 AM IST

liquor, Crime news, Punaguda, Wankidi

తల్లి మద్యం కోసం డబ్బులు ఇవ్వలేదని.. యువకుడు ఆత్మహత్య

కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ విషాద ఘటన చోటు చేసుకుంది. మద్యం కొనుగోలుకు తల్లి నగదు ఇవ్వకపోవడంతో మనస్థాపానికి గురైన ఓ యువకుడు తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. తల్లి మీద కోపంతో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన వాంకిడి మండలం పునగూడ గ్రామ పరిధిలోని సోనాపూర్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వాంకిడి సబ్‌ఇన్‌స్పెక్టర్‌ డి సాగర్‌ వెల్లడించారు.

సోమవారం హోలీ సందర్భంగా మద్యం కొనేందుకు తల్లి డబ్బులు ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురైన పునగూడ గ్రామానికి చెందిన ఎం.సురేష్‌ (18) పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడని తెలిపారు. వెంటనే ఆసిఫాబాద్‌లోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మద్యానికి బానిసైన అతడు డబ్బుల కోసం తల్లితో గొడవ పడేవాడని సమాచారం. వితంతువు అయిన అతని తల్లి పార్వతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story