కోర్కె తీర్చకుంటే.. నీ పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తా

Teacher indecent behavior on a woman.విద్యార్థుల‌కు విద్యా బుద్దులు నేర్పాల్సిన ఓ ప్ర‌భుత్వ ఉపాధ్యాయుడే కోర్కె తీర్చకుంటే.. నీ పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తా.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Jan 2021 5:18 AM GMT
crimes on woman

విద్యార్థుల‌కు విద్యా బుద్దులు నేర్పాల్సిన ఓ ప్ర‌భుత్వ ఉపాధ్యాయుడే ప‌క్క‌దోవ ప‌ట్టాడు. ఒంట‌రిగా వెలుతున్న మ‌హిళ‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడు. త‌న కోరిక తీర్చ‌కుంటే.. ఆమె చిన్నారుల భ‌విష్య‌త్తును నాశ‌నం చేస్తా అని బెదిరింపుల‌కు పాల్ప‌డ్డాడు. దీంతో బాధితురాలు కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఆ ఉపాధ్యాయుడిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. బెల్లంకొండ మండ‌లం న్యూ చిట్యాల‌లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ‌

పోలీసుల కథనం ప్రకారం. గ్రామానికి చెందిన బొల్లా శ్రీనివాసరావు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన ఓ మహిళ ఇంటింటికీ వెళ్లి నిమ్మకాయలు విక్రయిస్తుంటుంది. రోజూ మాదిరిగానే త‌న వ్యాపారాన్ని ముగించుకుని శ‌నివారం సాయంత్రం ఇంటికి వెలుతున్న ఆ మ‌హిళ‌ను శ్రీనివాస‌రావు అడ్డ‌గించాడు. ఆమె పైట చెంగు పట్టుకుని అసభ్యకంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె ఆగ్రహంతో ఇంటికి వెళ్లిపోతుంటే అతడు ఆమెను అనుసరించడమే కాకుండా ఆమె ఇంటికి వెళ్లి మరీ అసభ్యంగా ప్రవర్తించాడు.

'నీ పిల్లలకు చదువు చెబుతా. కోర్కె తీర్చకుంటే నీ పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తా. నన్నే వద్దంటావా? అని ఆమెతో ఘర్షణ పడి అడ్డు వచ్చిన ఆమె తల్లిదండ్రులను కొట్టి వెళ్లిపోయాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు బెల్లంకొండ క్రాస్‌ రోడ్డు వద్ద ఆ ఉపాధ్యాయుడిని తక్షణమే విధుల నుంచి తొలగించి, బాధితురాలికి న్యాయం చేయాలని ధర్నా చేశారు. పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Next Story
Share it