కారులో శవాలై కనిపించిన డ్రైవర్, మహిళ
సోమవారం డెహ్రాడూన్‌లో ఒక టాక్సీ డ్రైవర్, ఒక మహిళ కారులో చనిపోయి కనిపించారని పోలీసులు తెలిపారు.
By అంజి Published on 27 Aug 2024 2:30 PM ISTకారులో శవాలై కనిపించిన డ్రైవర్, మహిళ
సోమవారం డెహ్రాడూన్‌లో ఒక టాక్సీ డ్రైవర్, ఒక మహిళ కారులో చనిపోయి కనిపించారని పోలీసులు తెలిపారు. వారి మరణాలకు కారణం అధికంగా మద్యం సేవించడంతో పాటు కారు యొక్క ఏసీ గ్యాస్, ఉష్ణోగ్రత ప్రభావం కారణంగా కనిపిస్తోందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన డెహ్రాడూన్‌లోని రాజ్‌పూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. మృతులను రాజేష్ సాహు (50), మహేశ్వరి దేవి (45)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
"వాహనం బాధితుడు రాజేష్ సాహుకు చెందినదని, రాజేష్ సాహు, మహేశ్వరి దేవి ఇద్దరూ రాజ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాంత్ బంగ్లాలో నివాసితులని ప్రాథమిక సమాచారం వెల్లడించింది. రాజేష్ సాహు డ్రైవర్‌గా పనిచేసేవాడు. మహేశ్వరి దేవి వితంతువు" అని పోలీసులు తెలిపారు.
నాగల్ వలీ రోడ్డులోని సహస్త్రధార హెలిప్యాడ్ వెనుక కారు కనిపించింది. ఇద్దరు వ్యక్తులు అపస్మారక స్థితిలో ఉన్నారు. కంట్రోల్ రూమ్ నుంచి అలర్ట్ అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రాథమిక విచారణలో బాధితులు మద్యం సేవించే వారని తేలింది. ఘటన జరిగిన సమయంలో కారులో మంటలు చెలరేగాయి. ఎక్కువసేపు ఏసీని వాడటం, గ్యాస్ విడుదల కావడం, కారులోపల ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం వల్లే వారి మృతికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఫోరెన్సిక్ బృందం నేరస్థలాన్ని పరిశీలించగా ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేదా ఆధారాలు లభించలేదని రాజ్‌పూర్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ పీడీ భట్ తెలిపారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం పరీక్ష కోసం పంపించామని, నివేదిక వచ్చిన తర్వాత మరణానికి గల కారణాలపై మరింత స్పష్టత రానుంది. మరోవైపు చుట్టుపక్కల వారి నుంచి పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు.